తెలంగాణఖమ్మం జిల్లాజిల్లా వార్తలువైద్యం

DMHO : బస్తి దావఖాన తనిఖీ చేసిన DMHO.. కీలక ఆదేశాలు..!

DMHO : బస్తి దావఖాన తనిఖీ చేసిన DMHO.. కీలక ఆదేశాలు..!

ఖమ్మం,.మన సాక్షి :

ఖమ్మం నగరంలోని వై.ఎస్.ఆర్. నగర్ కాలనీ బస్తీ దవాఖానాను సందర్శించారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖానాలో అమలవుతున్న అన్ని ఆరోగ్య కార్యక్రమాలను సమగ్రంగా సమీక్షించారు. మాతా శిశు సంరక్షణ కార్డులు తప్పనిసరిగా సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా జారీ చేయాలని ఆదేశించారు.

ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం ఓ.పి. సేవలను నిరంతరం సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. సమగ్ర వ్యాధి పర్యవేక్షణ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను సకాలంలో నమోదు చేయాలనీ తెలిపారు.

హెచ్.ఐ.ఎం.ఎస్. ( హెచ్ఎంఐఎస్) డేటాను ఖచ్చితంగా, సమయానుకూలంగా నమోదు చేయాలని, అసంఖ్యాక వ్యాధుల పోర్టల్‌లో ఐ.డి.ఎస్.పి. ( ఐ డి ఎస్ పి ) పెండింగ్‌లో వున్న రిఫరల్స్‌ను మొదటి ప్రాధాన్యతతో త్వరితగతిన పరిష్కరించాలని, సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని తెలిపారు.

MOST READ 

  1. జపాన్ పర్యటనకు మోడల్ స్కూల్ విద్యార్థిని.. అభినంధించిన జిల్లా కలెక్టర్..! 

  2. Suryapet : వ్యవసాయ విద్యార్థులకు గ్రామీణ కృషి అనుభవం కీలకం.. ధూపహాడ్‌లో అవగాహన కార్యక్రమం..!

  3. SBI : ఎస్బిఐ కస్టమర్లకు రూ.2 లక్షలు ఇస్తుంది.. ఎందుకో తెలుసా..!

  4. 200 కుటుంబాలకు ఇబ్బంది.. శంకర్పల్లికి చౌక ధరల దుకాణం ఏర్పాటు చేయాలని డిమాండ్..!

మరిన్ని వార్తలు