Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsకరీంనగర్జిల్లా వార్తలు

జపాన్ పర్యటనకు మోడల్ స్కూల్ విద్యార్థిని.. అభినంధించిన జిల్లా కలెక్టర్..! 

సకురా" సైన్స్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటిన ఎలగందల్ మోడల్ స్కూల్ విద్యార్థిని గుర్రాల శివాంజలిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అభినందించారు.

జపాన్ పర్యటనకు మోడల్ స్కూల్ విద్యార్థిని.. అభినంధించిన జిల్లా కలెక్టర్..! 

కరీంనగర్, మనసాక్షి :

“సకురా” సైన్స్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటిన ఎలగందల్ మోడల్ స్కూల్ విద్యార్థిని గుర్రాల శివాంజలిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అభినందించారు. తెలంగాణ మోడల్ స్కూల్ ఎలగందల్ లో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న శివాంజలి రాత పరీక్ష, స్క్రీన్ టెస్ట్ ద్వారా ఈ పర్యటనకు ఎంపికయ్యారు.

రాష్ట్రం నుండి నలుగురు మాత్రమే ఈ పర్యటనకు ఎంపికవగా అందులో జిల్లాకు చెందిన శివాంజలి ఉండడం విశేషం. మే 24 నుండి 30 వరకు జపాన్ పర్యటించి అక్కడి పరిశ్రమలు, పరిశోధన సంస్థలను సందర్శిస్తారు. శివాంజలిని జిల్లా విద్యాధికారి అశ్విని తానాజీ వాకడే అభినందించారు.

కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి జయపాల్ రెడ్డి, విద్యాశాఖ కోఆర్డినేటర్లు అశోక్ రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్, ఎంఈఓ ఆనందం, ప్రిన్సిపాల్ కొడిమ్యాల శ్రీనివాస్, తల్లిదండ్రులు కరుణాకర్, శారద పాల్గొన్నారు.

MOST READ 

  1. Nalgonda : ఆసుపత్రి నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. కీలక ఆదేశం..!

  2. Nalgonda : బెట్టింగులకు అలవాటు పడి.. చివరికి అలా మారాడు..!

  3. Alumni : 40 సంవత్సరాల తర్వాత కలయిక.. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..! 

  4. Nalgonda : మధ్యప్రదేశ్ లోని థార్ జిల్లాను జల్లడ పట్టిన నల్గొండ సిసిఎస్ పోలీసులు.. ఎందుకో తెలిస్తే షాక్..!

మరిన్ని వార్తలు