ఎక్స్ యూజర్లకు భారీ గుడ్ న్యూస్.. ఇక ఏకంగా 20 ఫోటోలు, వీడియోలు..!
సోషల్ మీడియాలో ఎక్స్ యూజర్లకు భారీ గుడ్ న్యూస్ అందింది. ఇప్పటి వరకు పోస్టులో కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే మీడియా ఫైళ్లను షేర్ చేయడానికి అనుమతి ఉండేది.

ఎక్స్ యూజర్లకు భారీ గుడ్ న్యూస్.. ఇక ఏకంగా 20 ఫోటోలు, వీడియోలు..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
సోషల్ మీడియాలో ఎక్స్ యూజర్లకు భారీ గుడ్ న్యూస్ అందింది. ఇప్పటి వరకు పోస్టులో కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే మీడియా ఫైళ్లను షేర్ చేయడానికి అనుమతి ఉండేది. కానీ ఏకంగా ఐదు రెట్లు ఎక్కువ ఫోటోలు, వీడియోలు షేర్ చేసే వెసులుబాటును ఎక్స్ కల్పించింది. ఇప్పటివరకు ఒక పోస్టులో గరిష్టంగా కేవలం నాలుగు ఫోటోలు, వీడియోలను మాత్రమే అటాచ్ చేయడానికి అనుమతి ఉండేది. కానీ తాజా అప్డేట్ తో ఈ పరిమితిని ఏకంగా 20 ఫోటోలు, వీడియోలకు పెంచుతూ ఎక్స్ ప్లాట్ ఫామ్ నిర్ణయం తీసుకుంది.
Also Read : ఏపీ ప్రభుత్వంతో రూ.2,500 కోట్ల భారీ ఒప్పందం కుదుర్చుకున్న ఎస్.ఎల్.ఎన్.కాఫీ..
ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం వెబ్ వెర్షన్ లో పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. మొబైల్ యాప్ లో ఈ సదుపాయం కనిపించని యూజర్లు తమ ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎక్స్ యాప్ ను లేటెస్ట్ వెర్షన్ అప్డేట్ చేసుకోవాలని కూడా సూచించింది.









