Breaking Newsజిల్లా వార్తలునల్గొండ
త్రికూట శివాలయానికి సీసీ రోడ్డు మంజూరు చేయాలని ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌కు వినతి
మిర్యాలగూడ మండలం లక్ష్మీపురం గ్రామంలోని పురాతన త్రికూట శివాలయానికి విచ్చేసే భక్తులు రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆలయానికి సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ దేవాలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ని కలిసి వినతిపత్రం అందజేశారు.

మిర్యాలగూడ, మన సాక్షి :

Also Read : వేములపల్లి బ్రిడ్జి పై ధాన్యం ట్రాక్టర్ బోల్తా.. ఒకరికి గాయాలు..!
ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం త్రికూట శివాలయం నుంచి లక్ష్మీపురం గ్రామం వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువచ్చారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి సీసీ రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరయ్యేలా కృషి చేయాలని కోరారు.