దేవరకొండలో ప్రభుత్వ సేవలు ఒకేచోట అందుబాటులోకి..!
దేవరకొండ పట్టణంలో ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలను ఒకే సముదాయంలో ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రూ.25 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నిర్మాణానికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ శుక్రవారం స్థల పరిశీలన నిర్వహించారు.

దేవరకొండలో ప్రభుత్వ సేవలు ఒకేచోట అందుబాటులోకి..!
రూ.25 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే బాలు నాయక్
(చింతపల్లి, మనసాక్షి – వెంకట్)
దేవరకొండ పట్టణంలో ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలను ఒకే సముదాయంలో ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రూ.25 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నిర్మాణానికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ శుక్రవారం స్థల పరిశీలన నిర్వహించారు.
పట్టణంలోని 18వ వార్డు పరిధిలో మరియు పోలీస్ స్టేషన్ సమీపంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ పక్కన ఉన్న స్థలాన్ని దేవరకొండ ఆర్డీవో, తహసీల్దార్ మరియు సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యాలయాల నిర్మాణానికి అనువైన స్థలం, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ప్రజలకు రాకపోకల పరంగా కలిగే సౌలభ్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Also Read : ఎక్స్ యూజర్లకు భారీ గుడ్ న్యూస్.. ఇక ఏకంగా 20 ఫోటోలు, వీడియోలు..!
ఈ ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల సముదాయం అందుబాటులోకి వస్తే వివిధ ప్రభుత్వ శాఖల పనుల కోసం ప్రజలు వేర్వేరు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతుందని, ఒకే ప్రాంగణంలో అనేక ప్రభుత్వ సేవలు పొందేందుకు వీలవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన పరిపాలన, సత్వర సేవలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నిర్మాణానికి సంబంధించి అవసరమైన తదుపరి చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, ఆలంపల్లి నర్సింహా, హనుమంతు వెంకటేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ రయీస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మారుపాకుల సురేష్ గౌడ్, వడ్త్యా దేవేందర్ నాయక్, లోకసాని శ్రీధర్ రెడ్డి, వై.ఎస్. కరుణాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.









