Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్వ్యవసాయం

రికార్డ్ స్థాయిలో పసుపు ధర.. క్వింటా రూ.33,800..!

పసుపు రైతులకు శుభ సూచకం. రికార్డు స్థాయిలో ధర పలికింది. దాంతో రైతులు ఆనందంలో ఉన్నారు.

రికార్డ్ స్థాయిలో పసుపు ధర.. క్వింటా రూ.33,800..!

— కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి హర్షం 

(ఆర్మూర్ – చిరంజీవి)

పసుపు రైతులకు శుభ సూచకం. రికార్డు స్థాయిలో ధర పలికింది. దాంతో రైతులు ఆనందంలో ఉన్నారు. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌లో పసుపు ధర రికార్డు స్థాయిలో క్వింటాలుకు రూ.33,800 పలకడం పసుపు రైతులకు శుభసూచకమని నిజామాబాద్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు తిరుపతి రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆర్మూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ చేస్తున్న నిరంతర కృషి, శ్రమ ఫలితంగానే పసుపునకు మంచి ధర లభిస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలవడం, ఏ పీ ఈ డి ఏ అపేడా ఆధ్వర్యంలో మార్కెట్ లింకేజ్ కార్యక్రమాలు నిర్వహించడం, స్పైసెస్ బోర్డు ద్వారా రైతులకు అవగాహన కల్పించడం వంటి చర్యల వల్లనే మార్కెట్‌లో ధరలు క్రమంగా పెరుగుతున్నాయని తెలిపారు.

రైతులు పురుగు మందుల అవశేషాలు లేకుండా సేంద్రియ పద్ధతులు, ఐపిఎం ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్ విధానంలో పసుపును సాగు చేస్తే అంతర్జాతీయ మార్కెట్‌లో మరింత డిమాండ్ పెరిగి, భవిష్యత్తులో పసుపు నిజమైన బంగారంగా మారుతుందని ఎంపీ ధర్మపురి అర్వింద్ సూచించినట్లు ఆయన తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఎంపీ అర్వింద్‌కు పసుపు రైతుల తరపున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు