Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుపండుగలుసూర్యాపేట జిల్లా

రాయనిగూడెంలో ఘనంగా అయ్యప్ప స్వామి మడి పూజ

రాయనిగూడెం గ్రామంలో అయ్యప్పస్వామి మడి పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

రాయనిగూడెంలో ఘనంగా అయ్యప్ప స్వామి మడి పూజ

(గరిడేపల్లి, మనసాక్షి – వీరాస్వామి)

రాయనిగూడెం గ్రామంలో అయ్యప్పస్వామి మడి పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన అయ్యప్పస్వామి భక్తులు ఇంటింటి నుంచి బయలుదేరి భజన కార్యక్రమాలతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా సాగారు. ఈ సందర్భంగా గ్రామంలోని గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అయ్యప్ప స్వామి నామస్మరణ, భజన పాటలతో గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గురుస్వాములు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, చిన్నారులు, అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read : రేపటితో ముగియనున్న ముగ్గురి ఎమ్మెల్సీల పదవీకాలం.. మూడు ఖాళీలే..!

ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు గుండు రామాంజి గౌడ్, గ్రామ సర్పంచ్ చింతా అధ్యక్షులు, పీఠాధిపతి గురుస్వామి గుండు రామాంజనేయ స్వామి, పజ్జెందోపడి గుండు రాంబాబు స్వామి, గుండు వెంకన్న స్వామి, గుండు శ్రీనివాస్ స్వామి, గుండు హనుమంతు స్వామి, మేకపోతుల రాంబాబు స్వామి, కుక్కడపు వినయ్, గుండు సైదులు, గుండు నవీన్, శ్రీదర్శాయి, అయ్యప్ప వీరబాబు, అంజయ్య, నరేష్, రామకృష్ణ తదితర అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు