తెలంగాణBreaking Newsహైదరాబాద్

CM Revanth Reddy : తెలంగాణకు సైనిక్ స్కూలు మంజూరు చేయండి..!

తెలంగాణలో 10 ఏళ్లుగా ఒక్క సైనిక్ స్కూల్ కూడా మంజూరు చేయలేదని, సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

CM Revanth Reddy : తెలంగాణకు సైనిక్ స్కూలు మంజూరు చేయండి..!

మన సాక్షి, హైదరాబాద్ :

తెలంగాణలో 10 ఏళ్లుగా ఒక్క సైనిక్ స్కూల్ కూడా మంజూరు చేయలేదని, సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం తరఫున పలు విజ్ఞప్తులను ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ కు మార్చాలని ఆయన కోరారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాలలో సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. అందులో భాగంగానే వికారాబాద్ లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్ కు 3,000 ఎకరాలు కేటాయించినట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, (తెలంగాణ & ఆంధ్ర సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్) డిజిపి శివధర్ రెడ్డి, పలువురు రాష్ట్ర ప్రభుత్వ, ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Suryapet : సూర్యాపేట మున్సిపాలిటీలో ఎన్నికల రిజర్వేషన్లు ఇవీ.. ఎవరికి ఎన్ని సీట్లు అంటే..!

  2. Miryalagida : మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో ఇవీ రిజర్వేషన్లు.. బీసీలకు ఎన్ని సీట్లు అంటే..!

  3. Khammam : విషాద ఘటన.. ఆడుకుంటూ వెళ్లి సాంబారులో పడి చిన్నారి మృతి..!

  4. Rythu Bharosa : రైతులకు శుభవార్త.. రైతు భరోసా పై కీలక అప్డేట్..!

మరిన్ని వార్తలు