Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం, లేటెస్ట్ అప్డేట్..!
తెలంగాణ ప్రభుత్వం సరికొత్త తాజా నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలలో జమ చేసేందుకు నిర్ణయించింది.

Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం, లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం సరికొత్త తాజా నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలలో జమ చేసేందుకు నిర్ణయించింది. మొదట్లో జనవరి మాసంలో సంక్రాంతి పండుగకు రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు ముహూర్తం నిర్ణయించిన విషయం తెలిసిందే.
కానీ ఈ నెలాఖరులోగా అంటే జనవరి 26వ తేదీన రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేసేందుకు నిర్ణయించింది. రైతు భరోసా పై తాజాగా రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండ రెడ్డి వివరాలను వెల్లడించారు. యాసంగి సీజన్లో రైతు భరోసా అందజేసేందుకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది.
నూతన మార్గదర్శకాల మేరకు పంటలు సాగు చేసిన రైతులకు రైతు భరోసా నిధులు అందించాలని నిర్ణయించింది. అందుకు గాను శాటిలైట్ ఆధారంగా పంటల సాగును నిర్ణయించి, రైతులకు నేరుగా ఖాతాలలో డబ్బులు జమ చేయనున్నారు. సాగు చేయని భూములకు, కొండలకు, గుట్టలకు ఈ విడత రైతు భరోసా నిధులు కట్ చేయనున్నారు.
నూతన మార్గదర్శకాల ఆధారంగా రైతు భరోసా అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో కాస్త ఆలస్యం అయింది. ఏది ఏమైనా ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేసే అవకాశాలు ఉన్నాయి.









