Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESviralతెలంగాణ

వేపచెట్టు కొమ్మల నుంచి బుసబుస శబ్దం.. తీరా చూస్తే విచిత్ర దృశ్యం..!

వేపచెట్టు నుండి పాలధార నిర్విరామంగా స్రవిస్తోంది. ఈ విచిత్ర సంఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో జరిగింది.

వేపచెట్టు కొమ్మల నుంచి బుసబుస శబ్దం.. తీరా చూస్తే విచిత్ర దృశ్యం..!

మేళ్లచెరువు, మనసాక్షి:

వేపచెట్టు నుండి పాలధార నిర్విరామంగా స్రవిస్తోంది. ఈ విచిత్ర సంఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో జరిగింది. మేళ్లచెరువు గ్రామానికి చెందిన ఫోటో గ్రాఫర్ ఇస్లావత్ బాలాజీ ఇంట్లో ఉన్న వేప చెట్టు నుండి రెండు రోజులుగా వేపచెట్టు నుండి ఈ పాలధార ఉబికి వస్తోంది.

చెట్టు కొమ్మకు గల రంధ్రం నుండి బుసబుసమనే శబ్దం తో పాల లాంటి ఈ ద్రవం కారుతోంది. ఆరేళ్లుగా అద్దెకు ఇదే ఇంట్లో ఉండి, ఆ తర్వాత అదే ఇల్లు కొన్నామని బాలాజీ తెలిపాడు. ఇల్లు కొన్నప్పుడు చెట్టు చిన్నగా ఉండేదని ఇప్పుడు 30 అడుగుల ఎత్తుకు పెరిగి పెద్దదైనట్లు చెప్పాడు.

ఈ వింత ఘటన ఏంటో మాకు అర్ధం కాలేదని చెప్పాడు. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం లో వేప చెట్టుకు పాలు కారతాయని విన్నానని, ఇప్పుడు చూసి ఆశ్చర్య పోయానని బాలాజీ చెప్పాడు.

MOST READ NEWS 

  1. Viral : చంకన బిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసిన కానిస్టేబుల్.. ప్రశంసల జల్లు..!

  2. Cyber Crime : రూ.5 వేలు ఇచ్చారు.. రూ.2.9 కోట్లు కొట్టేశారు..!

  3. BIG BREAKING : సూర్యాపేట జిల్లా కారు ప్రమాదంలో ఇద్దరు ప్రధానోపాధ్యాయులు మృతి..!

  4. BIG BREAKING : సూర్యాపేట జిల్లా కారు ప్రమాదంలో ఇద్దరు ప్రధానోపాధ్యాయులు మృతి..!

మరిన్ని వార్తలు