TOP STORIESహైదరాబాద్

విజయవంతమైన రెడ్డి సింహ గర్జన సభ, మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం

విజయవంతమైన రెడ్డి సింహ గర్జన సభ,

మంత్రి మల్లారెడ్డి కి చేదు అనుభవం

హైదరాబాద్, మనసాక్షి : రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సింహ గర్జన సభ విజయవంతమైంది. భారీ సంఖ్యలో రెడ్డి కులస్తులు తరలివచ్చారు. సభలో పాల్గొన్న పలువురు ప్రముఖులు మాట్లాడుతూ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసే దాకా ఆందోళన చేస్తామని పిలుపునిచ్చారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5 వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి మూడున్నర సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని డిమాండ్ తో ఢిల్లీలో ఆందోళన నిర్వహించాలన్నారు. రెడ్డి సింహం గర్జన బహిరంగ సభకు రాష్ట్రం నలు మూలల నుండి భారీగా తరలివచ్చారు. రెడ్డి జేఏసీ చైర్మన్ అప్పమ్మ గారి రాంరెడ్డి అధ్యక్షత వహించగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, జేఏసీ నాయకులు మాధవ రెడ్డి, నరేందర్ రెడ్డి , రాధిక, నాగమణి, జైపాల్ రెడ్డి, పాల్గొన్నారు.

మంత్రి మల్లారెడ్డి కి చేదు అనుభవం :

రెడ్ల సింహగర్జన సభలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి కి చేదు అనుభవం ఎదురైంది. తన ప్రసంగంలో పదే పదే సీఎం కేసీఆర్ ను టిఆర్ఎస్ ను పొగుడుతూ మాట్లాడటం సభకు హాజరైన వారికి నచ్చలేదు. దాంతో పాటు మల్లారెడ్డి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా ఆగ్రహించిన మంత్రి మధ్యలోనే ప్రసంగం వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా.. వాహనంపై కుర్చీలు, వాటర్ బాటిల్, చెప్పులు, రాళ్లతో దాడులు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. మల్లా రెడ్డి డౌన్.. డౌన్.. అంటూ నినాదాలు చేశారు. పోలీసులు భద్రత నడుమ మంత్రిని అక్కడి నుంచి పంపించేశారు.

ఇవి కూడా చదవండి :

1. యువతిపై నలుగురు యువకుల అత్యాచారయత్నం, వీడియో తీసిన మరో మహిళ

2. మిర్యాలగూడలో .. ఆరు గడ్డివాములు దగ్ధం, తప్పిన ప్రమాదం 

3. BREAKING : విమానం ఆచూకీ గల్లంతు, 22 మంది ప్రయాణికులు, నలుగురు భారతీయులు

మరిన్ని వార్తలు