క్రైంBreaking Newsతెలంగాణనల్గొండ

Miryalaguda : రూ.3 కోట్లతో చిట్టీల వ్యాపారి రాత్రికి రాత్రే పరార్.. లబోదిబోమంటున్న బాధితులు..!

Miryalaguda : రూ.3 కోట్లతో చిట్టీల వ్యాపారి రాత్రికి రాత్రే పరార్.. లబోదిబోమంటున్న బాధితులు..!

మిర్యాలగూడ, మన సాక్షి:

మంచివాడిగా నమ్మించాడు.. చిట్టిల వ్యాపారం మొదలుపెట్టాడు.. కొంతకాలం సక్రమంగా చెల్లింపులు చేశాడు.. అదును చూసి కోట్ల రూపాయలు కొల్లగొట్టి రాత్రికి రాత్రే కుటుంబంతో సహా ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. దీంతో బాధితులు లబోదిబోమంటూ సోమవరం పోలీస్ స్టేషన్ కు వరుస కట్టారు..

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్ కాలునికి చెందిన కటకం సైదిరెడ్డి గత 15 ఏళ్లకు పైగా చిట్టిల వ్యాపారం సాగిస్తున్నాడు. స్థానికులతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకొని చిట్టిల వ్యాపారం మొదలుపెట్టాడు.

70 మందికి పైగా సభ్యులను ఏర్పాటు చేసుకొని రెండు లక్షల నుంచి 10 లక్షల వరకు చిట్టీలు నడుపుతూ కొంతకాలంగా సక్రమంగా చెల్లింపులు చేస్తూ వస్తున్నాడు. గత కొద్ది నెలలుగా చిట్టీలు పాడిన సభ్యులకు డబ్బులు చెల్లించక కాలయాపన చేస్తున్నాడు. ఇంటికి వెళ్లిన లేకపోవడం సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

ఇది తెలిసిన చిట్టిల వ్యాపారి  సైదిరెడ్డి రాత్రికి రాత్రే ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా ఉడాయించాడు. మొత్తం మీద 70 మంది సభ్యుల నుండి మూడు కోట్లకు పైగా వసూలుచేసి పరారైనట్లు తెలుస్తుంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిట్టిల వ్యాపారి సైదిరెడ్డి వేటలో ఉన్నారు.

MOST READ NEWS : 

  1. TG News : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు రిజర్వ్..!

  2. Ration Cards : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై వారికి రేషన్ కట్..!

  3. Alumni : 56ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం..!

  4. Rythu Bharosa : రైతుల ఖాతాలలో రూ.48 వేలు ఒకేసారి.. రైతుభరోసా మీకు రాలేదా.. వెంటనే ఇలా చేయండి..!

  5. Agriculture : వ్యవసాయ రంగంలో AI టెక్నాలజీ.. రైతులకు ఇక పండుగ..!

మరిన్ని వార్తలు