Nalgonda : నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి..!

Nalgonda : నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి..!
దేవరకొండ, మనసాక్షి :
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని కొండ భీమనపల్లి వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్, లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన సంభవించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చారగొండ (వంగూర్) కు చెందిన కొట్ర శివ అనే వ్యక్తి ఓ మహిళతో కలిసి బైక్పై చారకొండ నుంచి దేవరకొండ వైపు వస్తున్నారు. అదే సమయంలో దేవరకొండ నుంచి కల్వకుర్తి వైపు వెళ్తున్న లారీ కొండ భీమనపల్లి వద్ద వీరి బైక్ను బలంగా ఢీకొట్టింది.
ఈ తీవ్ర ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న కొట్ర శివ మరియు ఆ మహిళ ఇద్దరూ తలకి బలమైన గాయాలై ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఒకరిని కొట్ర శివగా గుర్తించినప్పటికీ మృతి చెందిన మహిళ వివరాలు ఇంకా తెలియరాలేదు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమా లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
కొండ భీమనపల్లి గ్రామంలో డివైడర్ లేకపోవడం వలన వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ప్రజలు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి డివైడర్లను ఏర్పాటు చేయాలని కొండ భీమనపల్లి గ్రామస్తులు కోరారు.
MOST READ NEWS :
-
TG News : తెలంగాణ ప్రభుత్వానికి ఊరట.. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలనం..!
-
GOOD NEWS : పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త.. ఇళ్ల నిర్మాణాలకు ఇక ఫీజు రూ.1 మాత్రమే..!
-
Roti : రాత్రి మిగిలిన రోటీ పారేస్తున్నారా.. ఇలా చేస్తే అద్భుతం.. ఆరోగ్య లాభాలు తెలుసుకోండి..!
-
Ex Municipal Chairperson : ఛండీహోమం నిర్వహించిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్..!









