GOOD NEWS : పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త.. ఇళ్ల నిర్మాణాలకు ఇక ఫీజు రూ.1 మాత్రమే..!

GOOD NEWS : పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త.. ఇళ్ల నిర్మాణాలకు ఇక ఫీజు రూ.1 మాత్రమే..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
పేద, మద్య తరగతి ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త తెలియజేసింది. ఇళ్ల నిర్మాణాలకు ఇకపై ఫీజు ఒక రూపాయి మాత్రమే చెల్లించాలని ప్రకటించింది. పేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్ల నిర్మాణాలకు సులభతరం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 50 చదరపు గజాల స్థలంలో గ్రౌండ్ ఫ్లోర్ లేదా జి ప్లస్ వన్ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇంటి నిర్మాణానికి రిజిస్ట్రేషన్ కోసం కేవలం ఒక రూపాయి మాత్రమే ఫీజు చెల్లించాలని నిర్ణయించింది.
ఈ మేరకు అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ ఫీజు 3000 రూపాయలుగా ఉండేది. నగర పంచాయతీలో, సంస్థలు నగరపాలక సంస్థలలో కూడా 50 గజాల వరకు ఇంటి నిర్మాణానికి ఒక రూపాయి ఫీజు ను అమలు చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పేదలు, మధ్య తరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
MOST READ :









