Breaking Newsక్రైంజాతీయంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Hyderabad : కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి.. నాచారం వాసులుగా గుర్తింపు..!

Hyderabad : కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి.. నాచారం వాసులుగా గుర్తింపు..!

మృతులు హైదరాబాద్ లోని నాచారం వాసులు

మినీ బస్సును ఢీకొట్టిన లారీ.. మధ్యప్రదేశ లో ఘోర రోడ్డు ప్రమాదం

మన సాక్షి, నాచారం :

మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ జిల్లా పరిధిలో ఘోర
రోడ్డు ప్రమాదం జరిగింది. సిహోరా పట్టణ శివారులో రాంగ్ రూట్లో వస్తున్న లారీ మినీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో హైదరాబాద్ కు చెందిన ఏడుగురు అక్కడకక్కడే మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించి స్థానికులు బస్సులో చిక్కుకుపోయిన వారికి కాపాడి ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, హైదరాబాద్ లోని నాచారం నుంచి కొంతమంది భక్తులు ప్రయాగ లో జరుగుతోన్న కుంభమేళాకు మినీ బస్సులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బజల్పూర్ జిల్లా కేంద్రానికి 65
కి.మీ. దూరంలో ఉన్న సిహోరా పట్టణ శివారులో ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదం లో బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు ఆరుగురు ఒకే కుటుంబానికి చెందినవారుగా భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకునన్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అయితే, ప్రమాదానికి గురైన బస్సు రిజిస్టేషన్ ఆధారంగా ప్రమాదానికి గురైన వారు ఏపీకి కి చెందిన వారు అనుకున్నారు, కానీ మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో మృతులంతా హైదరాబాద్ నగరంలోని నాచారం వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

■ MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో జమ కాలేదా.. అయితే ఇలా చేయండి..!
  2. Gold Price : రికార్డ్ స్థాయిలో రూ.8700 పెరిగిన గోల్డ్ రేట్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు..!
  3. Ration Cards : హమ్మయ్య.. ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు.. తొలిగిన సందిగ్ధం..!
  4. Suryapet : ఎండి పోయిన బోరు నుండి ఎగిసిపడుతున్న గంగమ్మ.. (వీడియో)

మరిన్ని వార్తలు