Gold Price : పసిడి ప్రియులకు భారీ ఊరట.. తగ్గిన బంగారం ధర..!
Gold Price : పసిడి ప్రియులకు భారీ ఊరట.. తగ్గిన బంగారం ధర..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
బంగారం ప్రియులకు బిగ్ రిలీఫ్ లభించింది. నూతన సంవత్సరంలో నెల రోజుల పాటు వరుసగా బంగారం ధర పెరిగి రికార్డు స్థాయికి చేరింది. తులం బంగారం 84 వేల రూపాయల మార్కులు సైతం దాటింది. సోమవారం పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్ లభించింది. బంగారం ధర తగ్గి ఉపశమనం కలిగింది.
100 గ్రాముల బంగారం కు సోమవారం 4400 రూపాయలు తగ్గింది. శని, ఆదివారాల్లో 100 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం 7,74,500 రూపాయలు ఉండగా సోమవారం ఒక్కరోజే 4000 రూపాయలు తగ్గి 7,70,500 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్స్ 100 గ్రా బంగారం 8,44,900 రూపాయలు ఉండగా సోమవారం 4400 తగ్గి 8,40,500 రూపాయలు ఉంది.
హైదరాబాదులో 10 గ్రాముల (తులం) బంగారం 22 క్యారెట్స్ 77,050 ఉండగా 24 క్యారెట్ 10 గ్రాముల (తులం) బంగారం 80,050 రూపాయలు ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం మార్కెట్ ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఉన్నాయి.









