Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసానికి పన్నాగం.. రూ.18 లక్షల బదిలీకి యత్నం, పోలీసుల చాకచక్యం..! 

Nalgonda : డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసానికి పన్నాగం.. రూ.18 లక్షల బదిలీకి యత్నం, పోలీసుల చాకచక్యం..! 

నల్లగొండ, మనసాక్షి.

సైబర్ మోసగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో నల్లగొండలో ఓ యువకుడిని భారీ మోసానికి పాల్పడేందుకు యత్నించిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి సైబర్ మోసగాళ్లకు మనీ ట్రాన్స్ఫర్ కాకుండా వ్యవహరించారు.

డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరింపులకు గురి చేస్తూ 18 లక్షల రూపాయలు తమ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి లేదంటే మీమ్మల్ని అరెస్ట్ చేస్తామని భయభ్రాంతులకు గురిచేసిన కేసును నలగొండ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే స్పందించి బాధితుని వద్ద నుండి 18 లక్షల రూపాయలు బదిలీ కాకుండా కాపాడడం జరిగిందని సైబర్ క్రైమ్ డి.ఎస్.పి డిఎస్పి లక్ష్మీనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నల్లగొండ పట్టణానికి చెందిన రిటైర్ టీచర్ పుచ్చకాయల దేవేందర్ రెడ్డి పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త సిమ్ తీసుకుని అతనికి ఫోన్ కాల్ చేసి బెంగళూరులో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నట్లు తప్పుడు ఆరోపణలు చేస్తూ మిమ్మలిని అరెస్ట్ చేస్తున్నట్లు బెదిరిస్తారు. మీరు అరెస్ట్ కాకుండా ఉండాలంటే మేమిచ్చిన అకౌంట్ నెంబర్‌కు వెంటనే రూ.18 లక్షలు డిపాజిట్ చేయాలి అంటూ డిమాండ్ చేశారు.

వీరి బెదిరింపులకు భయపడి బాధితుడు ప్రకాశం బజార్‌లోని ఎస్‌బీఐ బ్యాంకుకి వెళ్లి రూ.18 లక్షలు డిపాజిట్ చేయాలని మేనేజర్‌ ను కోరడంతో అనుమానం వచ్చిన మేనేజర్ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందజేశారు. తక్షణమే సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్‌ఐ విష్ణుకుమార్, సిబ్బంది అక్కడికి చేరుకొని దేవేందర్ రెడ్డిని విచారించగ జరిగిన సంఘటన తెలపగా అతనికి వచ్చిన ఫోన్ కాల్ లిస్ట్‌ను పరిశీలించి సైబర్ నేరగాళ్లకు తిరిగి కాల్ చేసి ప్రశ్నించగా తడపడుతూ వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్బంగా సైబర్ క్రైమ్ డియస్పి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రభుత్వ సంస్థలు లేదా అధికారులు గాని బెదిరించటం, భయపెట్టడం చేయరు. వీడియో కాల్స్ ద్వారా అరెస్టులు చేయరని. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.
అటువంటి కాల్స్ వస్తే నమ్మకుండా వెంటనే డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ సైబర్ క్రైమ్ డాట్ గౌట్ ఇన్ నందు లేదా 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి రిపోర్ట్ చేయాలని సూచించారు.

సకాలంలో స్పందించి సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా కాపాడిన నల్లగొండ సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్సై విష్ణు, హెడ్ కానిస్టేబుల్ రియాజ్, కానిస్టేబుల్ మోక్షిద్ లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అభినందించారు.

మరిన్ని వార్తలు