Crime News : వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి..!
Crime News : వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి..!
లక్షేట్టిపేట్ , (మన సాక్షి);
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్తూరు గ్రామ శివారులో వ్యవసాయ బావిలో పడి లాల్ దాస్ కొంరే (31) మధ్యప్రదేశ్ కు చెందిన వ్యక్తి బావిలో పడి మృతి చెందాడు. మృతుడు గత ఐదు రోజుల క్రితం తన గ్రామానికి చెందిన మరో నలుగురు మిత్రులతో కలిసి లక్షెట్టిపేట పట్టణంలోని కరీంనగర్ చౌరస్తాలో గల మామిడి కాయలు మండిలో పనిచేయడానికి వచ్చాడు.
అందరితో కలిసి వచ్చిన అతను ఒక్కరోజు మాత్రమే పనిచేసి వచ్చిన కూలి డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆదివారం ఉదయం కొత్తూరు గ్రామ శివారులో ఉన్నటువంటి వ్యవసాయ బావిలో కొంతమందికి శవం కనిపించడంతో వెళ్లి పోలీస్ సిబ్బందికి చేపట్టగా మృతుని ఆచూకీ తెలుసుకున్నారు.
మద్యం సేవించి మద్యం మత్తులో నడుచుకుంటూ వెళ్ళి ప్రమాదవశత్తు బావిలో పడి మృతి చెందివుంటాడని మృతునికి బావమరిది అయిన సంజీవ్ దుర్వే తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన లక్షెట్టిపేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లం నరేందర్, మృతుడి బావమరిది సంజీవ్ తెలిపిన వివరాలు ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని లక్షెట్టిపేట్ ఎస్సై పెట్టేం చంద్రకుమార్ తెలిపారు.
ALSO READ :









