Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

BIG BREAKING : అధికార పార్టీలోకి గోడలు దూకే నాయకులారా.. మీ పతనానికి చరమగీతం ముందుంది, మిర్యాలగూడలో ఫ్లెక్సీ పై మహిళల దాడి..!

BIG BREAKING : అధికార పార్టీలోకి గోడలు దూకే నాయకులారా.. మీ పతనానికి చరమగీతం ముందుంది, మిర్యాలగూడలో ఫ్లెక్సీ పై మహిళల దాడి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జంపు జిలానిలు ఎక్కువయ్యారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి పదవులు అనుభవించి, అధికారం చలాయించి.. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అటువైపు వెళ్లిపోయారు. ఆ తర్వాత పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ లో అధికారంలో ఉండి పదవులు అనుభవించి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు.

అనేక చోట్ల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరికలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గా ఉండి బీఆర్ఎస్ లోకి వెళ్లి తిరిగి కాంగ్రెస్ లోకి రావద్దంటూ.. కార్యకర్తలు, నాయకులు సైతం వ్యతిరేకిస్తున్నారు.

అలాంటిదే నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి, ప్రజాప్రతినిధులుగా గెలుపొంది బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే పలువురు నాయకులు బీఆర్ఎస్ లోకి వెళ్లారు. బీఆర్ఎస్ లో పది సంవత్సరాల పాటు పదవులు అనుభవించి ఉన్నారు. తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్లీ సొంత గూడు అంటూ కాంగ్రెసులో కి చేరెందుకు సిద్ధమయ్యారు.

కొంతమంది బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరకుండా ఉండగా, మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో స్థానిక నాయకులను సంప్రదించకుండా పార్టీ అధిష్టానం వద్ద కాంగ్రెసులో చేరారు. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు వ్యతిరేకించడంతో వారి చేరికను అధిష్టానం రద్దు చేసింది.

ఇదిలా ఉండగా మిర్యాలగూడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మహిళలు ఫ్లెక్సీ పై పేడతో దాడి చేసి నిరసన వ్యక్తం చేశారు. ఏ పార్టీలో అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి గోడదూకే నాయకులు.. మీ పతనానికి చరమగీతం ముందుంది.. అని ఉన్న ఫ్లెక్సీ పై పేడ , చెప్పులతో దాడి చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి పదవులు అనుభవించి పార్టీని మోసం చేసి వెళ్లిపోయిన నాయకులు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు.

మిర్యాలగూడ పట్టణమే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని మోసం చేసి బీఆర్ఎస్ లోకి పోయిన నాయకులను తిరిగి చేర్చుకోవద్దంటూ ఇటీవల తీర్మానం చేసిన విషయం కూడా తెలిసిందే. కాగా మహిళలు ఫ్లెక్సీ పై దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నాయకులు వద్దంటున్నా.. అదే పార్టీలో చేరుతామంటున్న నాయకులు ఇప్పుడు ఏం చేస్తారో వేచి చూద్దాం… !

ALSO READ : 

Miryalaguda : బిఆర్ఎస్ కు బిగ్ షాక్… కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మున్సిపల్ చైర్మన్ బార్గవ్..!

Miryalaguda : మున్సిపల్ చైర్మన్ భార్గవ్ కాంగ్రెస్ లో చేరికకు బ్రేక్..!

Komatireddy : కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది..!

Telangana : నేను పిలిస్తే 25 మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధం.. భువనగిరి, నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు సర్పంచులుగా కూడా పనికిరారు..!

Phone Taping : భాస్కర్ రావు పై స్కైలాబ్ నాయక్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు.. విచారణ చేయాలని డిమాండ్..!

మరిన్ని వార్తలు