Telangana : నేను పిలిస్తే 25 మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధం.. భువనగిరి, నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు సర్పంచులుగా కూడా పనికిరారు..!

నేను పిలిస్తే బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telangana : నేను పిలిస్తే 25 మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధం.. భువనగిరి, నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు సర్పంచులుగా కూడా పనికిరారు..!

తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలుస్తాం

మంత్రి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

నల్లగొండ , మనసాక్షి.

నేను పిలిస్తే బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నల్లగొండ, భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు సర్పంచులుగా కూడా పనికి రారని ఆరోపణలు చేశారు. నల్లగొండ , భువనగిరిలో బీఆర్ఎస్ తలకిందులుగా పెట్టిన కూడా కనీసం వారికి డిపాజిట్లు కూడా రావని అన్నారు.

బుధవారం నల్గొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్ వేయనున్నట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 14 పార్లమెంట్ సీట్లు గెలబోతున్నాం అన్నారు. కేసీఆర్ నల్గొండ జిల్లాలను నాశనం చేశారని, నీటి జలాలు పంపకంలో జగన్, కేసీఆర్ లాలూచీ పడ్డారు. కేసీఆర్ వల్లనే జిల్లాకి కరువు వచ్చిందన్నారు.

మిర్యాలగూడకి కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని వస్తారని, బస్ యత్ర చేయడానికి కేసీఆర్ కి సిక్కు ఉండాలి..
కేసీఆర్ శకం ఇక ముగిసిందన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టి భాజపా రాజకీయాలు చేస్తోంది అన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని, పదేళ్ళలో ఏమి చేయని కేసీఆర్ బస్ యాత్ర ద్వారా ఏమి చేస్తారన్నారు.

భారాస ఒక్క సీట్ కూడా గెలవదన్నారు. మెదక్ స్థానం ఒక్కటి గెలిపించుకో కేసీఆర్.. భారాస నేతలు గురుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి బాగా చెప్పాడని, జగదీశ్ రెడ్డి గురుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి సరిగా చెప్పాడన్నారు. సుఖేందర్ రెడ్డి కి ధన్యవాదాలు చెబుతున్నాం అన్నారు.

బస్ యాత్ర కాదు మోకాళ్ళు యాత్ర చేసిన.. నల్గొండ, భవనగిరిలో డిపాజిట్లు కూడా రావు అన్నారు. ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్, జడ్ పి టీ సి లక్ష్మయ్య, పాశం రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరెన్నో వార్తలు క్లిక్ చేయండి : 

BREAKING : బీఆర్ఎస్ లో కొనసాగుతున్న రాజీనామాలు.. మిర్యాలగూడలో మరో సీనియర్ నేత రాజీనామా..!

Miryalaguda : బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ లోకి చేర్చుకోవద్దని తీర్మానం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో హాట్ టాపిక్..!

Telangana : మిర్యాలగూడ నుంచే కేసీఆర్ రోడ్ షో.. షెడ్యూల్ ఇదే..!

Revanth Reddy : ఇక లెక్క పెట్టుకో.. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి వార్నింగ్..!

BIG BREAKING : బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. రేవంత్ తో భేటీ అయిన మరో ఎమ్మెల్యే..!

Miryalaguda : బిఎల్ఆర్ తో కలిసి ఎంపీ అభ్యర్థి రఘువీర్ మార్నింగ్ వాక్.. పట్టణమంతా కలియ తిరిగి ప్రచారం..!