Revanth Reddy : ఇక లెక్క పెట్టుకో.. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి వార్నింగ్..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూస్తే ఏమవుతుందో తెలుస్తుంది అన్నారు. కెసిఆర్ కు కాలం చెల్లిందని.. కారు షెడ్డు కు వెళ్ళింది ఇక రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తలుచుకుంటే కెసిఆర్ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు మిగులుతారో ఇక లెక్క పెట్టుకోవాల్సిందే అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Revanth Reddy : ఇక లెక్క పెట్టుకో.. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి వార్నింగ్..!

మన సాక్షి , మహబూబ్ నగర్ :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూస్తే ఏమవుతుందో తెలుస్తుంది అన్నారు. కెసిఆర్ కు కాలం చెల్లిందని.. కారు షెడ్డు కు వెళ్ళింది ఇక రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తలుచుకుంటే కెసిఆర్ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు మిగులుతారో ఇక లెక్క పెట్టుకోవాల్సిందే అంటూ వార్నింగ్ ఇచ్చారు.

మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించిన జన జాతర బహిరంగ సభలో రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు ఒప్పించారు. 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్, కేంద్రంలో మోడీ పాలమూరుకు చేసింది ఏమీ లేదన్నారు. 2009లో కేసీఆర్ ను పాలమూరు ప్రజలు ఎంపీగా గెలిపించారని, గెలిపిస్తే అని ఏం చేయలేదని అన్నారు. కృష్ణానది పక్కనే ప్రవహిస్తున్నప్పటికీ పాలమూరులో కేసీఆర్ ఎందుకు ప్రాజెక్టులు కట్టలేదని అన్నారు. విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఏ మాత్రం సహకరించలేదని, పరిశ్రమలను జిల్లాకు తీసుకురాలేదని .. కానీ ఏ మొహం పెట్టుకొని కేసీఆర్ ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు.

కారును తూకం పెట్టి అమ్ముడే

కారును తూకం పెట్టి అమ్ముడేనని, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కారును బొంద తీసి పాతిపెట్టారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి హైట్ టెన్షన్ వైరు అని.. ముట్టుకుంటే మాడి మసైపోతారని హెచ్చరించారు . తమ ఎమ్మెల్యేలకు కంచవేసి కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ఇది అడవి బిడ్డల ప్రభుత్వమని , స్వయం సహాయక బృందాలతో మహిళ సంఘాలను ఆదుకున్నామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. పాలమూరు బిడ్డ నాయకుడై దేశం నలుమూలలు తిరిగి పాలమూరు ప్రతిష్ట పెంచుతాడని అన్నారు.

గజ్వేల్ దొరలు, గద్వాల గడిల దొరసాని : 

కేంద్రం నుంచి 30 వేల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గజ్వేల్ దొరలు, గద్వాల గడిల దొరసాని ప్రజలను బానిసల్లాగా మార్చుకుంటున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పాలనలో పాలమూరు కి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో పాలమూరుకి ఇప్పుడు సువర్ణ అవకాశం వచ్చిందని , పాలమూరులోని రెండు పార్లమెంటు స్థానాలను గెలిపించాలని జిల్లాకు మరింత అభివృద్ధి కి కృషి చేస్తామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 14 ఎంపీ సీట్లు గెలిపించాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు క్లిక్ చేసి చదవండి 👇

Nalgonda : మా జోలికొస్తే లాగు లిప్పి కొడతామంటూ.. కోమటిరెడ్డి బ్రదర్స్ పై రెచ్చిపోయిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి..!

Elections : లోకసభ ఎన్నికల నామినేషన్లు షురూ.. నల్లగొండకు తొలి రోజు 4 నామినేషన్లు..!

Aadhaar : మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో మీకు నచ్చలేదా..? అయితే ఇలా మార్చేయండి..!

Whatsapp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఇక మీ ఫ్రెండ్స్ స్టేటస్ పెట్టగానే..!

Komatireddy : మూడు నెలలలో బిఆర్ఎస్ ఆఫీస్ పునాదులు లేకుండా చేస్తాం… కోమటిరెడ్డి అంటే ఏంటో చూయిస్తా..!