Komatireddy : మూడు నెలలలో బిఆర్ఎస్ ఆఫీస్ పునాదులు లేకుండా చేస్తాం… కోమటిరెడ్డి అంటే ఏంటో చూయిస్తా..!

పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్ సంవత్సరం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని వ్యాఖ్యలు చేయడం ఎంత ధైర్యం అని ఏ కుట్ర తోటి ఈ మాటలు అన్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ కేటీఆర్ ల పై రయ్యారు.

Komatireddy : మూడు నెలలలో బిఆర్ఎస్ ఆఫీస్ పునాదులు లేకుండా చేస్తాం… కోమటిరెడ్డి అంటే ఏంటో చూయిస్తా..!

రేపటినుండి కేసీఆర్ ను వెంటాడి వేటాడుతాం.

కోమటిరెడ్డి అంటే ఏంటో చూయిస్తా

సంవత్సరం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందన్న కేసీఆర్ వ్యాఖ్యలపై భగ్గుమన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

నల్లగొండ. మనసాక్షి .

పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్ సంవత్సరం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని వ్యాఖ్యలు చేయడం ఎంత ధైర్యం అని ఏ కుట్ర తోటి ఈ మాటలు అన్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ కేటీఆర్ ల పై రయ్యారు. బుధవారం నల్లగొండలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మళ్లీ ఒకసారి ప్రభుత్వం పడిపోతుందని అంటే వాళ్ల అంతు చూస్తామన్నారు.

 

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎలా పడగొడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు .గతంలో రేవంత్ రెడ్డి బిజెపిలకు పోతాడని తండ్రి కొడుకులు మాట్లాడుతున్నారని వారికి కవిత జైలుకు వెళ్లిన తర్వాత మతి భ్రమించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 37 వేల కోట్ల బకాయిలు పెట్టి పోయాడని జీతాలు సరిగా ఇవ్వలేదని టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను అప్పులను సరి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు.

ఎన్నికల కోడ్ పోగానే దశలవారీగా రైతుబంధును అమలు చేస్తామన్నారు. అలాగే నల్లగొండలో 700 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేసి రోడ్డు చుట్టూ కాలనీలు కర్తామన్నారు జూన్ మాసంలో ఔటర్ రింగ్ రోడ్డుకు శంకుస్థాపన చేస్తామన్నారు .అలాగే నల్లగొండను రాష్ట్రంలో మోడల్ సిటీగా మారుస్తామన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో ఎస్ ఎల్ బి సి ని పూర్తి చేయకుండా ఎడారిని చేశారని కెసిఆర్ చేసిన పాపం వల్లనే వర్షాలు రావడంలేదని విమర్శించారు.

 

ఫోన్ క్యాపింగ్ కేసులో రావులందరూ జైలుకు వెళ్లక తప్పదన్నారు. 10 సంవత్సరాలు దరిద్రపాలన చేసిన కేసీఆర్ వలన నేడు కరువు వచ్చిందన్నారు. తెలంగాణలో 13 ఎంపీ సీట్లను గెలుచుకుంటామని నల్లగొండ భవనగిరిలలో టిఆర్ఎస్ కు డిపాజిట్ కూడా రాదని అని చెప్పారు మూడు నెలలలో టిఆర్ఎస్ కనుమరుగవుతుందని తెలిపారు.

పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ బిజెపికే మధ్యన పోటీ అని టిఆర్ఎస్ ఉనికే లేదన్నారు. కాంగ్రెస్ను టచ్ చేస్తే మా తడాఖా ఏంటో చూపిస్తామన్నారు. ఈ సమావేశంలో జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య పట్టణ అధ్యక్షుడు గుముల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.