Nalgonda : మా జోలికొస్తే లాగు లిప్పి కొడతామంటూ.. కోమటిరెడ్డి బ్రదర్స్ పై రెచ్చిపోయిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి..!

నేను నిఖార్సయిన ఉద్యమకారుణ్ణి. ఫైటర్ ను ప్రజల కోసం ఎన్ని సార్లు అయిన జైల్ కి పోయే దమ్మున్న నాయకుణ్ణి... నన్ను విమర్శించే అర్హత కోమటిరెడ్డి సోదరులకు లేదని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు.

Nalgonda : మా జోలికొస్తే లాగు లిప్పి కొడతామంటూ.. కోమటిరెడ్డి బ్రదర్స్ పై రెచ్చిపోయిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి..!

నల్లగొండ. మన సాక్షి :

నేను నిఖార్సయిన ఉద్యమకారుణ్ణి. ఫైటర్ ను ప్రజల కోసం ఎన్ని సార్లు అయిన జైల్ కి పోయే దమ్మున్న నాయకుణ్ణి…
నన్ను విమర్శించే అర్హత కోమటిరెడ్డి సోదరులకు లేదని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నాయకుడు జనార్దన్ రావు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన కుటుంబానికి పరామర్శించడానికి గురువారం నల్లగొండకు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.?

కోమటిరెడ్డి సోదరులకు నడిమంతరపు సిరి వచ్చి కింద మీద ఆగడం లేదుఅని. కోమటిరెడ్డి సోదరులకు బ్రోకర్లు అని పేరుందన్నారు. జిల్లా రాజకీయాల్లో వెదవులు వీళ్ళు అని
నల్గొండ జిల్లా అన్నదాతలను మోసం చేసి, సాగర్ నీళ్లను ఆంధ్రకు అమ్మి అప్పటి సీఎం వైయస్సార్ వద్ద ముడుపులు తీసుకున్న వెదవులు కోమటిరెడ్డి సోదరులు అని ఘాటుగా విమర్శించారు.

ఇచ్చిన భిక్ష తో బ్రతికోనోళ్లు వీళ్ళు.. వీళ్ళు కేసీఆర్ పై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. జాగ్రత్త బిడ్డ లాగు విప్పి కొడతాం…నోరు అదుపులో పెట్టుకోవాలి…
రేవంత్ బూట్లు తుడుస్తున్నారు కోమటిరెడ్డి అన్నదమ్ములు.
రేవంత్ సంక నాకుతూ పబ్బం గడుపుతున్నారని
కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీ కి ఓటెయ్యాలని చెప్పిన దగాకోర్ కోమటిరెడ్డి అని దుయ్యబట్టారు.

ఆగర్బ శ్రీమంతుల్లాగా బిల్డప్ ఇస్తున్నారు. నా చరిత్ర ఎంటో, మీ చరిత్ర ఎంటో చర్చ పెడదామా, అని సవాల్ విసిరారు.
కోమటిరెడ్డి సోదరుల బలుపు అనగగోడతమ్. జిల్లాకు పట్టిన శని వీల్లు… సంస్కారం లేని వెదవులు విల్లు. బిడ్డ నోరు అదుపులో పెట్టుకోండి… ప్రజల ముందు బండారం బయటపెడతాము. లిల్లిపూట్ గాళ్ళు వీళ్ళు. రేవంత్ ముమ్మాటికీ బీజేపీ మనిషే. బీజేపీ లోకి పోతాడు అని కాంగ్రెస్ మంత్రులే లీక్ లు ఇస్తున్నారు. కేసీఆర్ జోలోకి వస్తే తన్ని తరిమేస్తాం అని హెచ్చరించారు. ఆయన వెంట జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ALSO READ : 

Aadhaar : మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో మీకు నచ్చలేదా..? అయితే ఇలా మార్చేయండి..!

Whatsapp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఇక మీ ఫ్రెండ్స్ స్టేటస్ పెట్టగానే..!

Komatireddy : మూడు నెలలలో బిఆర్ఎస్ ఆఫీస్ పునాదులు లేకుండా చేస్తాం… కోమటిరెడ్డి అంటే ఏంటో చూయిస్తా..!