Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్జాతీయంటెక్నాలజీతెలంగాణ

Whatsapp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఇక మీ ఫ్రెండ్స్ స్టేటస్ పెట్టగానే..!

Whatsapp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఇక మీ ఫ్రెండ్స్ స్టేటస్ పెట్టగానే..!

మన సాక్షి, వెబ్ డేస్క్:

మార్కెట్లో ఎన్నో రకాల మెసేజ్ యాప్స్ ఉన్నప్పటికీ వాట్సప్ కు మాత్రం ఆదరణ తగ్గడం లేదు. వాట్సప్ ఆదరణ రోజు రోజుకు పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా వాట్స్అప్ వినియోగదారులు కోట్లాదిమంది ఉన్నారు. వాట్సప్ క్రేజ్ తగ్గకపోవడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకురావడమే అని చెప్పవచ్చును.

యూజర్లకు అనుగుణమైన పద్ధతిలో వాట్సప్ నూతన ఫీచర్లను తీసుకొస్తుంది. ఇప్పటికే అనేక రకాల ఫీచర్స్ తీసుకొచ్చింది. దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్లంతా వాట్సప్ ఫీచర్ ను తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. ఎన్నో రకాల మెసేజింగ్ యాప్స్ ఉన్నప్పటికీ వాట్సప్ కు క్రేజ్ ఉంది.

మరో కొత్త ఫీచర్ తో వాట్సాప్ ముందుకు రాబోతుంది. అధునాతన ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉందని చెప్పవచ్చును. ఈ ఫీచర్ కు కూడా ఎంతో ఆదరణ లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం వాట్సాప్ లో స్టేటస్ కు చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతారు. ఇప్పుడు మనం వాట్సాప్ లో స్టేటస్ చూడాలంటే అప్డేట్స్ లోకి వెళ్లి చూడాల్సి వస్తుంది. సాధారణంగా మనకు కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారివి స్టేటస్ లు కనిపిస్తాయి.

ఇకపై అలా కాకుండా కొత్త ఫీచర్ ను తీసుకురాబోతుంది. మన కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారు.. ఎవరైనా స్టేటస్ పెట్టగానే మీకు అలర్ట్ వచ్చేలా పనిచేస్తుంది. ఈ ఫీచర్ అలర్ట్ వస్తే భలే ఉంటుంది కదా..! ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ స్థితిలో ఉన్నది. ఈ ఫీచర్ ను త్వరలో యూజర్ లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం.

ALSO READ : 

Telangana : కెసిఆర్ , కేటీఆర్, జగదీశ్ రెడ్డి పై మిర్యాలగూడ సభలో కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు ..!

Truecaller : కాల్స్ , మెసేజ్ లు వచ్చినప్పుడు ఫోన్ చూడాల్సిన అవసరం లేదు.. డెస్క్ టాప్ లో ఎలా చూడాలో తెలుసుకోండి..!

BIG BREAKING : ఆన్ లైన్ యాప్ వేదింపులు.. యువకుడి ఆత్మహత్య..!

Weather Updates : తెలంగాణలో 9వ తేదీ వరకు వర్షాలు పడే జిల్లాలు.. వడగాడ్పులు వీచే జిల్లాలు ఇవే..!

మరిన్ని వార్తలు