BIG BREAKING : ఆన్ లైన్ యాప్ వేదింపులు.. యువకుడి ఆత్మహత్య..!

ఆన్ లైన్ లో యాప్ ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. లోన్ యాప్ నిర్వాహకుల వేదింపులతో సంగారెడ్డి జిల్లా అందోలు మండలం కన్సాన్పల్లి గ్రామానికి చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది

BIG BREAKING : ఆన్ లైన్ యాప్ వేదింపులు.. యువకుడి ఆత్మహత్య..!

సంగారెడ్డి జిల్లా కన్సాన్పల్లి గ్రామంలో విషాద ఛాయలు

అందోలు, మనసాక్షి :

ఆన్ లైన్ లో యాప్ ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. లోన్ యాప్ నిర్వాహకుల వేదింపులతో సంగారెడ్డి జిల్లా అందోలు మండలం కన్సాన్పల్లి గ్రామానికి చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబందించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కాడెం శ్రీకాంత్(21) సదాశిపేటలోని ఎంఆర్ఎఫ్ కంపెనీలో ఉద్యోగ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. లోన్ యాప్ ద్వారా రూ.25 వేల వరకు లోన్ తీసుకున్నాడు. లోన్ తీసుకున్న మరునాటి నుండి లోన్ కట్టాలంటూ రాత్రి పగలు తేడా లేకుండా మేసేజ్ లు . కాల్స్ రూపంలో టార్చర్ మొదలైంది. లోన్ యాప్ ద్వారా తీసుకున్న రూ.25వేల రుణం కంటే ఎక్కవగా సుమారుగా రూ.1.30 లక్షలు చెల్లించాడు.

 

దీంతో అతడు ఇక వారి టార్చర్ నుంచి విముక్తి లభించినట్లేనని రిలాక్స్ అయ్యాడు. కానీ లోన్యిదాదారుల వేదింపులు ఆగలేదు. దీంతో అతడు మరింత డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెసేజ్ లు రావడం మొదలయ్యాయి. దీంతో ఆ యువకుడు
బిత్తరపోయాడు. ఆ మెసేజ్, కాల్స్ కు స్పందించడం మానేశాడు.దీంతో లోన్ యాదారులు మరింత రెచ్చిపోయారు. అశ్లీల, అసభ్యకర పోస్టులు పెడుతూ వేదింపులు కొనసాగించారు. దీంతో తన పోన్ను స్వీచ్ ఆఫ్చయడంతో యువకుడి కుటుంబికులకు ఫోన్లు రావడం మొదలయ్యాయి.

 

తన కుటుంబికులకు లోన్ విషయం తెలిసిందని శ్రీకాంత్ వారి వేదింపులు తాళలేక మనస్థాపానికి గురై మార్చి 30న గడ్డి మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అటు తర్వాత పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్ లోని నీమ్స్ ఆసుపత్రి కి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మరణించినట్లు తెలిపారు.

శ్రీకాంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో కూడా లోస్యార్దారుల వేదింపులు ఆగలేదు. ఈ విషయమై మృతుని తండ్రి పోచయ్య ఇచ్చిన పిర్యదుమేరకు కేసు నమోదుచేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అరుణ్ కుమార్ గౌడ్ తెలిపారు.

గ్రామంలో విషాద చాయలు:

ఆన్లైన్ యాప్ వేదింపులకు మనస్థాపానికి గురై శ్రీకాంత్ గడ్డి మందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో యువకుడి స్వగ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. శ్రీకాంత్ అందరితో కలుపుగోలుగా ఉంటూ చిరునవ్వుతో పలుకరించేవాడని స్థానికులు చెబుతున్నారు. ఆయన మరణ వార్త విన్న స్నేహితులు, గ్రామస్తులు యువకుడి మరణం పట్ల కన్నీటి పర్యంతమయ్యారు. నేస్థమా మమ్మల్ని అర్ధాంతరంగా వదిలి వెళ్లి పోతున్నావా అంటూ శ్రీకాంత్ మరణ వార్తను తోటి స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఆ కుటుంబాన్ని వెంటాడుతున్న విషాదాలు:

గ్రామానికి చెందిన కడెం పోచయ్య, సుగుణ దంపతులకు ఇద్దరు కుమారులతో పాటు ఒక కూతురు సంతానం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో వారి కష్టాన్ని వ్యవసాయ కూలీ పనులను చేస్తూ తన మగ్గురు పిల్లలను పోషించడంలో వారి కష్టాన్నే మరిచిపోతూ వారి జీవనం సాగిస్తున్న తరుణంలో కూతురు మూడేళ్ల వయస్సుకు రాగానే ఎండ్ల బండి కిందపడి చనిపోయింది. అటు తర్వాత ఇద్దరు కుమారులను ఆప్యాయంగా చూసుకుంటూ జీవనం సాగిస్తున్న తరుణంలో పెద్ద కుమారుడు శ్రీకాంత్ ఇలా అర్థాంతరంగా మరణించడం మరోసారి ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

మరిన్ని వార్తలు :