Weather Updates : తెలంగాణలో 9వ తేదీ వరకు వర్షాలు పడే జిల్లాలు.. వడగాడ్పులు వీచే జిల్లాలు ఇవే..!

Weather Updates : తెలంగాణలో 9వ తేదీ వరకు వర్షాలు పడే జిల్లాలు.. వడగాడ్పులు వీచే జిల్లాలు ఇవే..!

మనసాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణ లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రం మొత్తం నిప్పుల కొలిమిలా మారింది. ఎండ తీవ్రత రోజుకు పెరిగి పగలు కూడా పట్టణాల్లో కర్య్ఫు వాతావరణం నెలకొంటుంది. ఇది ఇలా ఉండగా ఈనెల తొమ్మిదవ తేదీ వరకు వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి.. మరి ఏ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయనే విషయం తెలియజేసింది. అది ఏంటో తెలుసుకుందాం…

ఏప్రిల్7 తేది ఈ జిల్లాలో ఉరుములు మెర్పులతో వర్షాలు :

నేడు ఏప్రిల్ ఏడవ తేదీన ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ జిల్లాల్లో ఈదురు గాలులు సైతం వీచే అవకాశం ఉందని తెలియజేసింది. తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల నిజామాబాద్ జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.

ALSO READ : Chinthapally : ప్రతి ఒక్కరు దైవ చింతనతో ముందుకు వెళ్లాలి..!

ఈ జిల్లాలలో వేడి గాలులు, ఈక్క పోత ఉంటుంది:

కొన్ని జిల్లాలలో వర్షాలు కురుస్తుంటే మరి కొన్ని జిల్లాలలో వేడిగాలులు, ఉక్కపోత ఉండే అవకాశం ఉంది. తెలంగాణలోనే రాజన్న సిరిసిల్ల , కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలలో విపరీతమైన ఎండ తో పాటు ఉక్క పోత ఉండే పరిస్థితి ఉంది. అదేవిధంగా సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి , హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలలో ఎండతో పాటు వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.

ALSO READ : Buddhavanam Entry Tickets : నాగార్జున సాగర్ బుద్ధవనం ఎంట్రీ టికెట్ ధరలు..!

ఈనెల 8వ తేదీన సూచన: 

ఏప్రిల్ 8వ తేదీన ఉరుము, మెరుపులతో కూడిన 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రాంతాలు. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. కొన్నిచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ముఖ్యంగా కొమరం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్ ,నిర్మల్ జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలుల, వర్షాలు పడే అవకాశం ఉంది.

వాతావరణం చల్లబడే జిల్లాలు :

ఈ జిల్లాలలో వాతావరణం కాస్త చల్లబడే అవకాశం ఉంది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ , ,పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ ,వరంగల్, జనగాం , మహబూబాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్ జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు పడే అవకాశం. ఈ జిల్లాలలో కాస్త వాతావరణం చల్లబడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.

ALSO READ : BIG BREAKING : సూర్యాపేటలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, పలువురికి గాయాలు..!

9వ తేదీన వాతావరణ శాఖ సూచన ఇలా.. 

ఏప్రిల్ 9వ తేదీన వాతావరణ శాఖ సూచన ప్రకారం.. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు తేలికపాటి వర్షాలు తెలంగాణలోని పలు జిల్లాల్లో పడే అవకాశం ఉందని తెలియజేస్తుంది. తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల , వికారాబాద్, నిజామాబాద్ , మెదక్, సంగారెడ్డి జిల్లాలలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా భానుడి భగభగలతో పాటు తేలికపాటి వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది.

MOST READ :