Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESటెక్నాలజీతెలంగాణ

Truecaller : కాల్స్ , మెసేజ్ లు వచ్చినప్పుడు ఫోన్ చూడాల్సిన అవసరం లేదు.. డెస్క్ టాప్ లో ఎలా చూడాలో తెలుసుకోండి..!

Truecaller : కాల్స్ , మెసేజ్ లు వచ్చినప్పుడు ఫోన్ చూడాల్సిన అవసరం లేదు.. డెస్క్ టాప్ లో ఎలా చూడాలో తెలుసుకోండి..!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు మెసేజ్ లు వచ్చినప్పుడు మనం తరచుగా ఫోన్ చేస్తుంటాము. ఫోన్ ద్వారానే మెసేజ్ లకు రిప్లై కూడా ఇస్తుంటాము. కానీ ఫోన్ చూడకుండానే ఫోన్ కాల్స్ ఎవరు చేశారని తెలుసుకోవడంతో పాటు మెసేజ్ లు చూసి వాటికి రిప్లై కూడా ఇవ్వొచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం..

ట్రూ కాలర్ యాప్ ఈ సరి కొత్త సదుపాయం వినియోగదారులకు కల్పించింది. ట్రూ కాలర్ వెబ్ వెర్షన్ ను కొత్తగా లాంచ్ చేసింది. వాటి ద్వారా కొత్త నెంబర్లను కూడా వెబ్ లో వెతికే అవకాశం ఉంది. ట్రూ కాలర్ కొత్త ఫీచర్ తో ఇంటర్నెట్ డెస్క్ కాంటాక్ట్ లో లేని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ ని కూడా గుర్తించే విధంగా ఫీచర్ తీసుకొచ్చింది. వాట్సాప్ , టెలిగ్రామ్ తరహాలోనే ట్రూ కాలర్ కూడా వెబ్ వెర్షన్ కొత్తగా లాంచ్ చేసింది. దీని ద్వారా మీ ఫోను ట్రూ కాలర్ వెబ్ వెర్షన్ ద్వారా డెస్క్ టాప్ కు కనెక్ట్ చేసి కొత్త నెంబర్లను కూడా వెతకవచ్చును. వచ్చిన కాల్స్ ఎవరు చేశారని తెలుసుకోవడంతో పాటు మెసేజ్ లు కూడా చూసి వాటికి రిప్లై కూడా డెస్క్ టాప్ ద్వారానే ఇవ్వచ్చును. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ సదుపాయాన్ని ట్రూ కాలర్ కల్పించింది.

ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోను లాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ కనెక్ట్ చేయవచ్చును. ఫోన్లో వచ్చే మెసేజ్ ల ఇన్ బాక్స్ ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ నుంచే మెసేజ్ లకు రిప్లై చేయవచ్చును. ఫోన్ కాల్స్ కు కూడా అల్లర్టులను డెస్క్ టాప్ లో పొందవచ్చును. ఈ కొత్త ఫీచర్ వల్ల కాంటాక్ట్ వివరాలు తెలుసుకోవడంతో పాటు కంప్యూటర్ కీబోర్డును ఉపయోగించి వేగవంతంగా మెసేజ్ లు చేయవచ్చును. మొబైల్ మాదిరిగానే డెస్క్ టాప్ లో కూడా మెసేజ్ లు ఎన్క్రిప్ట్ చేసి ఉంచుతారు.

వెబ్ వెర్షన్ కు కనెక్ట్ ఎలా..?

ట్రూ కాలర్ లాప్టాప్ కానీ కంప్యూటర్స్ కు గాని కనెక్ట్ చేయడం ఎలా అనే విషయం తెలుసుకుందాం.. వాట్సాప్ మాదిరిగానే ట్రూ కాలర్ వెబ్ ను సులువుగా డెస్క్ టాప్ కు కనెక్ట్ చేసుకోవచ్చును. అందుకోసం ఆండ్రాయిడ్ యూసర్లు తమ ట్రూ కాలర్ యాప్ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అందులో దిగువన ఉండే మెసేజెస్ ట్యాబ్ లో పైన ఉండే త్రీ డాట్స్ మెనూ ఓపెన్ చేయాలి. అక్కడ మెసేజింగ్ ఫర్ వెబ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. డెస్క్ టాప్ లేదా లాప్టాప్ బ్రౌజర్ లో వెబ్ ట్రూ కాలర్ అని సెర్చ్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. దాని ద్వారా డివైజ్ నె లింకు చేయవచ్చును. వెంటనే మీ ట్రూ కాలర్ లో ఉన్న మెసేజ్ లు మొత్తం డెస్క్ టాప్ లో కనిపిస్తాయి.

MOST READ : 

Revanth Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రాధాన్యత సంతరించుకోనున్న ఇరువురి భేటీ..!

Telangana : తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలు.. రూ. 6 వేల వేతనంతో నియామకం..!

BIG BREAKING : ఆన్ లైన్ యాప్ వేదింపులు.. యువకుడి ఆత్మహత్య..!

Rythu Bharosa New Rules : రైతు భరోసా కొత్త రూల్స్.. రైతులకు హెచ్చరిక..!

Sleeping on The Foor : నేలపై పడుకుంటున్నారా.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!

మరిన్ని వార్తలు