Revanth Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రాధాన్యత సంతరించుకోనున్న ఇరువురి భేటీ..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి కలవనున్నారు. ఈ విషయం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

Revanth Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రాధాన్యత సంతరించుకోనున్న ఇరువురి భేటీ..!

హైదరాబాద్ , మన సాక్షి :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి కలవనున్నారు. ఈ విషయం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. లోకసభ ఎన్నికల సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి రేవంత్ రెడ్డి కలవాలని భావించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పార్లమెంటులో కూడా కొనసాగించే విధంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నం చేస్తుంది.

అందులో భాగంగానే భువనగిరి పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇన్చార్జిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. భువనగిరి పార్లమెంటు పై సమీక్ష సమావేశం నిర్వహించి నాయకులకు దిశా నిర్దేశం చేయనున్నారు.

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. కాగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ని గెలిపించేందుకు రేవంత్ రెడ్డి సైతం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కోమటిరెడ్డి బ్రదర్స్ కు కాకుండా భువనగిరి టికెట్ ను ఆయన అనుచరుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్న రేవంత్ రెడ్డి అంటూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది .ణకాగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకు అందరూ సహకరించాలనే ఉద్దేశంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్లనున్ధారు.

ALSO READ : 

BREAKING : నల్గొండ జిల్లా చిట్యాల లో బాంబుల కలకలం..!

Rythu Bharosa New Rules : రైతు భరోసా కొత్త రూల్స్.. రైతులకు హెచ్చరిక..!

Sleeping on The Foor : నేలపై పడుకుంటున్నారా.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!

Buddhavanam Entry Tickets : నాగార్జున సాగర్ బుద్ధవనం ఎంట్రీ టికెట్ ధరలు..!