Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Telangana : తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలు.. రూ. 6 వేల వేతనంతో నియామకం..!

Telangana : తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలు.. రూ. 6 వేల వేతనంతో నియామకం..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో ఇందిర‌మ్మ కమిటీలను త్వరలో నియమించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం, వార్డులలో ఈ కమిటీలు పనిచేసే విధంగా నియామకాలు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ మాదిరిగానే తెలంగాణలో కూడా ఇందిరమ్మ కమిటీలను నియమించే ఆలోచనలు ప్రభుత్వం ఉంది. వీరికి గౌరవ వేతనం కూడా ఇవ్వాలని భావిస్తున్నారు.

 

బుధవారం భువనగిరి పార్లమెంటు సమీక్ష సమావేశం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించారు. వారితో పాటు భువనగిరి నియోజకవర్గం లోని ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. కాగా తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలను నియమించే ఆలోచన కూడా చేసినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 36వేల మంది ని నియమించాలని ప్రభుత్వం భావిస్తుంది.

 

 

వీరికి ఒక్కొక్కరికి ఆరువేల రూపాయల వేతనం అందజేయనున్నారు. వీరందరిని కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసే కార్యకర్తలని నియమించుకునే అవకాశం ఉంది. ఈ కమిటీల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించే విధంగా ప్రయత్నం చేయనున్నారు. వీరి ద్వారానే ఇందిరమ్మ పింఛన్లు, ఇందిరమ్మ గృహాలు కూడా అందించే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యారెంటీ పథకాలను సైతం ఈ కమిటీల ద్వారానే అందించే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఇందిరమ్మ కమిటీలను నియమించనున్నారు.

 

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన పేదలందరికీ కూడా ఇందిరమ్మ కమిటీల ద్వారానే ఎంపిక చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ కమిటీలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నియమించడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా పార్టీని కూడా మరింత బలోపేతం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో ఇందిరమ్మ కమిటీల నియామకంలో ప్రభుత్వ అధికారుల పాత్రతోో పాటు స్థానిక ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఉండే అవకాశాలు ఉన్నాయి.

ALSO READ  : 

Revanth Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రాధాన్యత సంతరించుకోనున్న ఇరువురి భేటీ..!

Miryalaguda : మిర్యాలగూడలోని సాయితేజ సాల్వెంట్ మిల్లులో సూపర్ వైజర్ మృతి..!

BIG BREAKING : సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ కి ప్రమాదం.. ఇది మూడోసారి..!

BREAKING : సిబిఐ విచారణపై కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత..!

మరిన్ని వార్తలు