Aadhaar : మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో మీకు నచ్చలేదా..? అయితే ఇలా మార్చేయండి..!

ప్రస్తుతం ఆధార్ కార్డు అన్నింటికీ కూడా ఐడెంటిటీగా పనికివస్తుంది. ఆధార్ కార్డులో ఉన్న వివరాలు.. పేరు మరియు అడ్రస్ ఇతర సమాచారాన్ని కూడా మార్చవచ్చును. కానీ ఆధార్ కార్డులో ఫోటో ఎప్పటిదో ఉండటం చాలామందికి నచ్చదు. ఫోటోను మార్చుకోవాలంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అని భావిస్తారు.

Aadhaar : మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో మీకు నచ్చలేదా..? అయితే ఇలా మార్చేయండి..!

మన సాక్షి :

ప్రస్తుతం ఆధార్ కార్డు అన్నింటికీ కూడా ఐడెంటిటీగా పనికివస్తుంది. ఆధార్ కార్డులో ఉన్న వివరాలు.. పేరు మరియు అడ్రస్ ఇతర సమాచారాన్ని కూడా మార్చవచ్చును. కానీ ఆధార్ కార్డులో ఫోటో ఎప్పటిదో ఉండటం చాలామందికి నచ్చదు. ఫోటోను మార్చుకోవాలంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అని భావిస్తారు.

పాత ఫోటో ఉండటం వల్ల కార్డు కూడా తమదేనా..? కాదా..? అని అవతలి వారు ఆలోచించే పరిస్థితి వస్తుంది. అందుకోసం మీరు మీ ఆధార్ కార్డులో మీ ఫోటో నచ్చకుంటే ఫోటో కూడా మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవాలో పూర్తి సమాచారం తెలుసుకోండి.

ఇప్పుడు ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన కార్డులో ఒకటి. దీనిని భారత ప్రభుత్వం జారీ చేసింది. ప్రస్తుతం ఆధార్ కార్డు గుర్తింపు, చిరునామాకు ఉపయోగిస్తున్నారు. ఆధార్ కార్డులో 12 అంకెలు గల ప్రత్యేక సంఖ్య ఉంటుంది. అంతేకాకుండా ఫోటోతో పాటు బయోమెట్రిక్ సమాచారం కూడా పూర్తిగా ఉంటుంది. బ్యాంకు లావాదేవీలు పూర్తిగా ఆధార్ కార్డు తోనే లింక్ అయి ఉంటాయి. UIDAI ప్రకారం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డును అప్డేట్ చేయాల్సి ఉంటుంది.

అప్పుడు మీరు మీ పేరు, చిరునామా, ఇతర సమాచారాన్ని మార్చ వచ్చును. అది కాకుండా కార్డులోని మీ ఫోటోలు కూడా మార్చుకోవచ్చును. మీ ఆధార్ కార్డులో పాత ఫోటో ఉన్నట్లయితే అది మీకు నచ్చకుంటే చాలా సులభంగా తొలగించుకొని కొత్త ఫోటోలు అప్లోడ్ చేయవచ్చును. అది ఎలాగో ఆధార్ కార్డు ఫోటోను మార్చడం తెలుసుకుందాం…

ఇంట్లోనే ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవచ్చునా..?

యుఐడిఏఐ (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రకారం ఆధార్ కార్డు నుండి ఫోటోలు మార్చుకోవచ్చును. ఈ ప్రక్రియ ఇంటి నుండి చేయలేము. దానికోసం మీరు సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. కానీ ఆధార్ నుండి ఫోటో మార్చడానికి ఆన్ ,లైన్ లో దరఖాస్తు చేసుకో వచ్చును. uidai.gov.in అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి మీ ఆధార్ లింక్ చేయబడిన ఫోన్ నెంబర్.. ఆ నెంబర్ కు, పంపబడిన ఓటీపీ నమోదు చేయాల్సి ఉంటుంది.

లాగిన్ అయిన తర్వాత ఆధార్ నమోదు ఫారం కనిపిస్తుంది. ఆధార్ ఎన్రోల్మెంట్ ఫారం ను డౌన్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ ఎన్రోల్మెంట్ ఫారం ను పూరించి సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లి ఇవ్వాలి. మీ బయోమెట్రిక్ వివరాలను తనిఖీ చేయండి. అక్కడ రుసుము చెల్లించి ఆధార్ కార్డులో కొత్త ఫోటోలు అప్డేట్ చేసుకోవచ్చును. ఆన్లైన్ విధానాన్ని అనుసరించడం ద్వారా ఫోటో నవీకరించబడిన ఆధార్ ను సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చును.

ALSO READ : 

Truecaller : కాల్స్ , మెసేజ్ లు వచ్చినప్పుడు ఫోన్ చూడాల్సిన అవసరం లేదు.. డెస్క్ టాప్ లో ఎలా చూడాలో తెలుసుకోండి..!

Whatsapp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఇక మీ ఫ్రెండ్స్ స్టేటస్ పెట్టగానే..!