Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

BREAKING : బీఆర్ఎస్ లో కొనసాగుతున్న రాజీనామాలు.. మిర్యాలగూడలో మరో సీనియర్ నేత రాజీనామా..!

BREAKING : బీఆర్ఎస్ లో కొనసాగుతున్న రాజీనామాలు.. మిర్యాలగూడలో మరో సీనియర్ నేత రాజీనామా..!

మిర్యాలగూడ , మన సాక్షి :

మిర్యాలగూడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతల రాజీనామాలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

మిర్యాలగూడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు మరోసారి షాక్ తగిలింది. ఈనెల 24వ తేదీన మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ రోడ్ షో మిర్యాలగూడ నుంచి ప్రారంభించనున్నారు. రోడ్ షో ప్రారంభానికి ముందే పలువురు నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు.సోమవారం ఉదయం బీఆర్ఎస్ నేత మాజీ, మున్సిపల్ చైర్మన్ గార్లపాటి నిరంజన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు పెద్ది శ్రీనివాస్ గౌడ్ , మదర్ బాబా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా రెండు పర్యాయాలు కౌన్సిలర్ గా పనిచేసిన సీనియర్ నాయకులు వంగాల నిరంజన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతోపాటు మాజీ నీటి సంఘం చైర్మన్ గార్లపాటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. వీరు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సమాచారం.

రఘువీర్ రెడ్డికి మద్దతు : 

బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరకపోయినప్పటికీ నల్లగొండ పార్లమెంటు అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి మద్దతు తెలియజేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి విజయం కోసం కృషి చేస్తామని తెలియజేశారు. మరి కొంతమంది కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు వారు తెలిపారు.

మరెన్నో వార్తలు క్లిక్ చేయండి : 

Whatsapp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఇక మీ ఫ్రెండ్స్ స్టేటస్ పెట్టగానే..!

Telangana : కెసిఆర్ , కేటీఆర్, జగదీశ్ రెడ్డి పై మిర్యాలగూడ సభలో కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు ..!

Aadhaar : మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో మీకు నచ్చలేదా..? అయితే ఇలా మార్చేయండి..!

Raghu veer: జయహో రఘువీరా పాట ఆవిష్కరణ.. బి ఎల్ ఆర్ నేతృత్వంలో రూపొందించిన పాట..!

Komatireddy : మూడు నెలలలో బిఆర్ఎస్ ఆఫీస్ పునాదులు లేకుండా చేస్తాం… కోమటిరెడ్డి అంటే ఏంటో చూయిస్తా..!

మరిన్ని వార్తలు