Miryalaguda : బిఎల్ఆర్ తో కలిసి ఎంపీ అభ్యర్థి రఘువీర్ మార్నింగ్ వాక్.. పట్టణమంతా కలియ తిరిగి ప్రచారం..!

నల్లగొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గురువారం మిర్యాలగూడ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి తో కలిసి మార్నింగ్ వాక్ చేశారు.

Miryalaguda : బిఎల్ఆర్ తో కలిసి ఎంపీ అభ్యర్థి రఘువీర్ మార్నింగ్ వాక్.. పట్టణమంతా కలియ తిరిగి ప్రచారం..!

మిర్యాలగూడ , మన సాక్షి :

నల్లగొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గురువారం మిర్యాలగూడ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి తో కలిసి మార్నింగ్ వాక్ చేశారు. పట్టణమంతా ఆయనతో పాటు కలియతిరిగి ప్రతి ఒక్కరిని కలిసి తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్ నందు మార్నింగ్ వాకర్స్ తో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎన్నికల అనంతరం అతి త్వరలోనే వారి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. అనంతరం మిర్యాలగూడ రైతు మార్కెట్ సందర్శించి రైతులతో మాట్లాడారు. అనంతరం బస్టాండ్ ఎదురుగా గల సంతోష్ టీ స్టాల్ వద్ద టీ తాగుతూ స్థానికులతో చర్చించారు.

అనంతరం మున్సిపల్ కాంప్లెక్స్ నందు గల కార్మికుల అడ్డా నందు కార్మికులతో మాట్లాడారు. అనంతరం అమ్మ హోటల్ నందు అల్పాహారం చేసారు. మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. వారితోపాటు డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి, పొదిల శ్రీనివాస్, దేశిడి శేఖర్ రెడ్డి, గంధం రామకృష్ణ, తమ్ముడబోయిన అర్జున్, గోదాల జానకి రెడ్డి పాల్గొన్నారు.

ALSO READ : 

Whatsapp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఇక మీ ఫ్రెండ్స్ స్టేటస్ పెట్టగానే..!

Aadhaar : మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో మీకు నచ్చలేదా..? అయితే ఇలా మార్చేయండి..!

Raghu veer: జయహో రఘువీరా పాట ఆవిష్కరణ.. బి ఎల్ ఆర్ నేతృత్వంలో రూపొందించిన పాట..!