Miryalaguda : బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ లోకి చేర్చుకోవద్దని తీర్మానం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో హాట్ టాపిక్..!

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రజాప్రతినిధులుగా పదవులు అనుభవించారు... వారిదే పెత్తనం అంతా.. తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. 10 సంవత్సరాల పాటు మళ్ళీ వారిదే అధికారం... పెత్తనం చెలయించారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Miryalaguda : బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ లోకి చేర్చుకోవద్దని తీర్మానం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో హాట్ టాపిక్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రజాప్రతినిధులుగా పదవులు అనుభవించారు… వారిదే పెత్తనం అంతా.. తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. 10 సంవత్సరాల పాటు మళ్ళీ వారిదే అధికారం… పెత్తనం చెలయించారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇది రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలే.. కానీ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో మాత్రం హాట్ టాపిక్ గా మారింది ఈ విషయం.

ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచి బిఆర్ఎస్ లోకి వెళ్లడం.. పదవులు అనుభవించి 10 సంవత్సరాల పాటు వారు చలాయించారు. ఇప్పుడు అధికారం పోగానే కాంగ్రెస్ లోకి రావాలనుకుంటున్నారు. 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న నాయకులు, కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో వారిని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేర్చుకోవద్దని పట్టుబడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ లోకి చేర్చుకోవద్దంటూ మిర్యాలగూడ పట్టణ కౌన్సిలర్లు, ఇన్చార్జిలు, నాయకులంతా కలిసి తీర్మానం సైతం చేశారు. తీర్మానాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డికి సైతం పంపించారు.

తీర్మానం చేసి సీనియర్ నాయకులకు పంపాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు , ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పట్టణానికి చెందిన ఒక ప్రజా ప్రతినిధి జానారెడ్డి వద్దకు , ఉత్తంకుమార్ రెడ్డి వద్దకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద కూడా వెళ్లినట్లు తెలిసింది. వెళ్లినప్పటికీ కూడా స్థానిక ఎమ్మెల్యే పరిశీలించాల్సిందిగా ఆ నాయకులు చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉండగా పార్లమెంటు ఎన్నికలలోపే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఊహాగానాలు కూడా వస్తున్న నేపథ్యంలో నాయకులంతా కలిసి తీర్మానం చేశారు.

బీఆర్ఎస్ లో ప్రజాప్రతినిధులుగా, నాయకులుగా చలామని అయినవారు.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను , నాయకులను అనేక ఇబ్బందులకు గురి చేశారని.. తిరిగి వారిని కాంగ్రెస్ లో చేర్చుకునేది లేదంటూ తీర్మానం చేశారు.

మిర్యాలగూడ పట్టణ నాయకులతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ముఖ్య నాయకులను ఎవరిని కూడా పార్టీలో చేర్చుకోవద్దని, వారిని చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీకే నష్టం జరిగే అవకాశం ఉందని ప్రజల్లో కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకత వస్తుందని తీర్మానం చేయడం గమనార్హం. కాగా ఈ విషయం బయటికి పొక్కడంతో మిర్యాలగూడ పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతుంది. ఎన్నికలు అయ్యే వరకు రాజకీయ పరిణామాల్లో మార్పు ఎలా ఉంటుందో వేచి చూద్దాం..

మరెన్నో వార్తలు క్లిక్ చేసి చదవండి : 

BIG BREAKING : బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. రేవంత్ తో భేటీ అయిన మరో ఎమ్మెల్యే..!

Whatsapp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఇక మీ ఫ్రెండ్స్ స్టేటస్ పెట్టగానే..!

Nalgonda : మా జోలికొస్తే లాగు లిప్పి కొడతామంటూ.. కోమటిరెడ్డి బ్రదర్స్ పై రెచ్చిపోయిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి..!

Aadhaar : మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో మీకు నచ్చలేదా..? అయితే ఇలా మార్చేయండి..!

Komatireddy : మూడు నెలలలో బిఆర్ఎస్ ఆఫీస్ పునాదులు లేకుండా చేస్తాం… కోమటిరెడ్డి అంటే ఏంటో చూయిస్తా..!