Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : మున్సిపల్ చైర్మన్ భార్గవ్ కాంగ్రెస్ లో చేరికకు బ్రేక్..!

Miryalaguda : మున్సిపల్ చైర్మన్ భార్గవ్ కాంగ్రెస్ లో చేరికకు బ్రేక్..!

మిర్యాలగూడ , మన సాక్షి :

మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ శనివారం ఉదయం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా ఆయన చేరికకు బ్రేక్ పడింది. తిరునగరు భార్గవ్ తోపాటు మరో 12 మంది కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా వారి చేరికను మిర్యాలగూడ కాంగ్రెస్ నాయకులు మొదటినుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

కాగా స్థానిక నాయకులు తో కాకుండా ఆయన నేరుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి సమక్షంలో పార్టీలో చేరారు. దాంతో గాంధీభవన్ నుంచి ఆయన చేరికను నిషేధిస్తూ లేక వెలువడింది. నల్లగొండ జిల్లా నేతలతో సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు భార్గవ్ చేరికను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ లేఖ విడుదల చేశారు.

చేరికను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతల సమావేశం :

తిరునగరు భార్గవ్ కాంగ్రెస్ పార్టీలో చేరికను వ్యతిరేకిస్తూ మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక కార్యాలయంలో సమావేశం అయ్యారు. సమావేశానికి ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి పిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ తో పాటు పలువురు నాయకులు పాల్గొని భార్గవ్ చేరికను వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భార్గవ్ చేరికను నిషేధించిన విషయం తెలిసిందే. కాగా స్థానిక నాయకులు భార్గవ్ చేరిక ను వ్యతిరేకించడం, పీసిసి చేరికను నిషేధించడంతో ప్రస్తుతం భార్గవ్ ఆయన అనుచరులు ఏం చేస్తారనేది చర్చనీ అంశంగా మారింది.

ALSO READ : 

Miryalaguda : బిఆర్ఎస్ కు బిగ్ షాక్… కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మున్సిపల్ చైర్మన్ బార్గవ్..!

Miryalaguda : మిర్యాలగూడలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఫిక్స్..!

BREAKING : జైల్లో వేస్తానంటే కెసిఆర్ భయపడతాడా.. భయపడితే తెలంగాణ వచ్చేదా..!

మరిన్ని వార్తలు