Miryalaguda : మిర్యాలగూడలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఫిక్స్..!

మిర్యాలగూడ నియోజకవర్గంలో కారు పార్టీ ఖాళీ కాబోతుంది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత బస్సుయాత్ర ప్రారంభించి మిర్యాలగూడలోనే మొదటి రోడ్ షో నిర్వహించారు.

Miryalaguda : మిర్యాలగూడలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఫిక్స్..!

మిర్యాలగూడ , మన సాక్షి :

మిర్యాలగూడ నియోజకవర్గంలో కారు పార్టీ ఖాళీ కాబోతుంది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత బస్సుయాత్ర ప్రారంభించి మిర్యాలగూడలోనే మొదటి రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో కు ముందే కొంతమంది నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేయగా అదే దారిలో మరికొంతమంది నేతలు ఉన్నారు. కెసిఆర్ రోడ్ షో అపార్టీ కార్యకర్తల్లో జోష్ నింపినప్పటికీ నాయకులు మాత్రం పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.

ఇంతకాలం పాటు పార్టీ మార్పుపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చలు జరుపుతున్న పలువురు పట్టణ బీఆర్ఎస్ నాయకులు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. స్థానిక నాయకులు వారి రాకను వ్యతిరేకిస్తున్నారనే విషయం తెలిసిందే. దాంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. మిర్యాలగూడ పట్టణ ప్రముఖ నాయకులు, కౌన్సిలర్లు , మాజీ కౌన్సిలర్లు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

వీరంతా కుందూరు రఘువీర్ రెడ్డికి మద్దతు తెలియజేస్తూ వారి విజయానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పార్టీ మార్పు తప్పనిసరి అయిందని ఓ నాయకుడు పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా ఈనెల 27వ తేదీన హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరెవరు వెళ్తారనేది మిర్యాలగూడ పట్టణంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు : 

BREAKING : జైల్లో వేస్తానంటే కెసిఆర్ భయపడతాడా.. భయపడితే తెలంగాణ వచ్చేదా..!

Telangana : నేను పిలిస్తే 25 మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధం.. భువనగిరి, నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు సర్పంచులుగా కూడా పనికిరారు..!

KLN : ఇంటర్ ఫలితాల్లో కేఎల్ఎన్ ప్రభంజనం..!

Miryalaguda : మిర్యాలగూడలో బీఆర్ఎస్ కు షాక్.. కెసిఆర్ పర్యటనకు ముందే పలువురి రాజీనామా.!

Phone Taping : భాస్కర్ రావు పై స్కైలాబ్ నాయక్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు.. విచారణ చేయాలని డిమాండ్..!