BREAKING : జైల్లో వేస్తానంటే కెసిఆర్ భయపడతాడా.. భయపడితే తెలంగాణ వచ్చేదా..!

కెసిఆర్ ని జైల్లో వేస్తాడంట.. జైల్లో వేస్తానంటే కేసీఆర్ భయపడతాడా..? భయపడితే తెలంగాణ వచ్చేదా ..? అంటూ కేసిఆర్ ఉద్యమ తరహాలో స్పీచ్ ఇచ్చారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆయన రోడ్ షో నిర్వహించారు.

BREAKING : జైల్లో వేస్తానంటే కెసిఆర్ భయపడతాడా.. భయపడితే తెలంగాణ వచ్చేదా..!

మిర్యాలగూడ రోడ్ షోలో కేసీఆర్

మిర్యాలగూడ, మన సాక్షి :

కెసిఆర్ ని జైల్లో వేస్తాడంట.. జైల్లో వేస్తానంటే కేసీఆర్ భయపడతాడా..? భయపడితే తెలంగాణ వచ్చేదా ..? అంటూ కేసిఆర్ ఉద్యమ తరహాలో స్పీచ్ ఇచ్చారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆయన రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో కు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడే మాటల తీరు అదేనా అంటూ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను జైల్లో వేస్తానంటాడు.. పేగులు తీసి మెడలో వేసుకుంటాడట.. గుడ్లు పీకి గూటి లాడుతాడట. ఇదేనా ముఖ్యమంత్రి తీరు మాట్లాడేది అంటూ కేసిఆర్ విమర్శించారు.

420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని వాటిని అమలు చేయడం లేదన్నారు. డిసెంబర్ 9వ తేదీన తొలి సంతకం రుణమాఫీ పై పెడతానని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు రుణమాఫీ ఇవ్వలేదు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు గోసపెడుతున్నారని అన్నారు. 1956 నుంచి మనకు శత్రువులు కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఇచ్చిన హామీలలో రైతుబంధు ఇవ్వడంలేదని, రుణమాఫీ చేయలేదని, నిరుద్యోగ భృతి మాటే లేదని, పేదవారి పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు అన్నారు.

సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు కు అన్యాయం చేస్తుంటే అప్పుడు కోదాడ నుండి హాలియ వరకు పాదయాత్ర చేసినాను.
ఇవ్వాళ మళ్ళీ అన్నదాతలు దిగాలు పడి బాధలో వున్నారన్నారు. ఇవ్వాళ ఇరిగేషన్ మంత్రి ఈ జిలాల్లోనే వున్నాడు.. దద్దమ్మల్లాగా కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పారు. నల్లగొండ జిల్లా మంత్రులు కేసీఆర్ ను తిడుతూ బబ్బం గడుపుతున్నారని అన్నారు.

రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా అంటున్నారు ఓ మంత్రి.. అన్నదాతలు చెప్పులు ఇంకా గట్టిగా వుంటాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో 18 గంటల కరెంటు రైతులకు అందజేశామని ఇప్పుడు, కరెంటు లేకుండా పోయిందని, ఇంటింటికి భగీరథ నీళ్లు ఇచ్చామని ఇప్పుడు ఆ నీళ్లు ఇవ్వలేకపోతున్నారని అన్నారు.

 

కేసీఆర్ పక్కకు పోగానే అన్ని బంద్ అయినాయ్..
కేసీఆర్ తిట్టి పబ్బం గడుపుతున్నారు. అన్నదాతలు సపోర్ట్ లేకుండా ఏది నడవదు. మేము అధికారంలో వున్నప్పుడు మోడీ తో కోట్లాడి ధాన్యం కొనేలా చేసినమన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ ను గెలిపిస్తే నే అన్ని అమలు అయితాయి. కేసీఆర్ ఆనవాళ్లు తీసేస్తాం అంటున్నారు.

అది సాధ్యం అవుతుందా.. బిడ్డ నోరు అదుపులో పెట్టుకో…. అంబెడ్కర్ జయంతి రోజున హైదరాబాద్ లోని అంబెడ్కర్ విగ్రహానికి అవమానం చేశారు… మరి ఇప్పుడు న్యాయం జరగాలి….తప్పకుండా మన రాజ్యం వస్తది. డౌట్ లేదు…తప్పకుండా బీ ఆర్ ఎస్ గెలవాలి… మళ్ళీ మన హక్కులను సాదించుకుందామన్నారు. రోడ్ షో కార్యక్రమంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకల్ల జగదీశ్ రెడ్డి, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ,నల్లగొండ పార్లమెంటు అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

Komatireddy : కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది..!

Telangana : నేను పిలిస్తే 25 మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధం.. భువనగిరి, నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు సర్పంచులుగా కూడా పనికిరారు..!

Miryalaguda : మిర్యాలగూడలో బీఆర్ఎస్ కు షాక్.. కెసిఆర్ పర్యటనకు ముందే పలువురి రాజీనామా.!