విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి..!
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి..!
లక్షేట్టిపేట్, మన సాక్షి :
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ మర్రిపల్లిలో విద్యుత్ షాక్ తగిలి ఇటిక్యాలకు చెందిన చిలుక రాంకీ అనే (26)ప్రైవేట్ ఎలక్ట్రీరీషన్ మృతిచెందాడు. మృతుడు మున్సిపాలిటీ లో ఔట్ సోర్స్ లో ప్రైవేట్ ఎలక్ట్రీషన్ గా విధులు నిర్వహిస్తున్నారు.
మర్రిపల్లి లో దొంత కళ్యాణ్ అనే రైతు వ్యవసాయ మోటర్కు వచ్చే విద్యుత్ వైరుకు స్తంభంపై కార్బన్ రావడంతో విద్యుత్ పోల్ పైకి ఎక్కి మరమ్మతులు చేస్తుండగా దాని పైన ఉన్న గ్రామంలోకి వచ్చే 11కెవి విద్యుత్ వైర్లు ప్రమాదవశాత్తు చేతికి తాకడంతో విద్యుత్ షాక్ తగిలి స్తంభం పైనుండి కిందపడి చనిపోయాడు. మృతుని తల్లి రాజేశ్వరి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుందని లక్షెట్టిపేట్ ఎస్సై సతీష్ తెలిపారు. మార్చరిలో మృతదేహాన్ని సిఐ నరేందర్ పరిశీలించి మృతి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ALSO READ :
Cm Revanth Reddy: రైతులకు బిగ్ రిలీఫ్.. రూ.1350 కోట్లతో ఆ పథకం.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన..!









