Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

Cm Revanth Reddy: రైతులకు బిగ్ రిలీఫ్.. రూ.1350 కోట్లతో ఆ పథకం.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన..!

Cm Revanth Reddy: రైతులకు బిగ్ రిలీఫ్.. రూ.1350 కోట్లతో ఆ పథకం.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇతర సంక్షేమ పథకాలను కూడా చేపడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. రైతుల పట్ల అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

రాష్ట్రంలో రైతులకు అన్ని విధాల మేలు చేకూర్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీని ఇప్పటికి రెండు విడుదలగా చేసింది రెండు విడతలుగా 12,224 కోట్ల రూపాయలను 17 లక్షల 75 వేల 235 మంది రైతులకు రుణమాఫీ చేసింది.

వాన కాలం సీజన్ లోనే తెలంగాణ ప్రభుత్వం మరో పథకాన్ని తీసుకురానున్నది. గతంలో ఉన్న రైతు బీమా పథకాన్ని నూతనంగా అమలు చేయనున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాబోయే వానాకాలం సీజన్ లోనే రైతు బీమా పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది.

1350 కోట్ల రూపాయలతో రైతు బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమలు చేయలేదు.
రైతు బీమా పథకంతో రైతులకు ఎంతో మేలు చేకూరే అవకాశం ఉంది.

అతివృష్టి, అనావృష్టి సమయంలో పంటలు నష్టపోయిన సమయంలో రైతులకు భీమా సౌకర్యం ఉంటే నష్టపరిహారం అందెందుకు వీలుంటుంది. దానివల్ల రైతులకు ఎంతో మేలు చేకూరే అవకాశం ఉంది. అందుకుగాను ఈ ఏడాది నుంచే దానిని అమలు చేయనున్నారు.

ఇవి కూడా చదవండి : 

Runamafi : రైతుల ఖాతాలలోకి డబ్బులు.. రెండు విడతలుగా రు.12,224 కోట్ల రుణమాఫీ, జిల్లాల వారీగా వివరాలు..!

Cm Revanth Reddy : విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా అమలు..!

WhatsApp : వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. ఫోన్ నెంబర్ లేకుండానే క్రియేట్ చేయొచ్చు..!

క్యూసెక్కులు అంటే ఏమిటి.. నీటి ప్రవాహాన్ని అలా ఎందుకు కొలుస్తారు..!

మరిన్ని వార్తలు