Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

WhatsApp : వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. ఫోన్ నెంబర్ లేకుండానే క్రియేట్ చేయొచ్చు..!

WhatsApp : వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. ఫోన్ నెంబర్ లేకుండానే క్రియేట్ చేయొచ్చు..!

మన సాక్షి , ఫీచర్స్ :

వాట్సప్ మెసెంజర్ యాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ మెసేజింగ్ యాప్ ను ప్రపంచంలోనే అత్యధిక మంది వినియోగిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

త్వరలో మరో అద్భుతమైన ఫీచర్ ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నది. సోషల్ మీడియాలోని ప్లాట్ ఫామ్ ల మాదిరిగానే వాట్సాప్ లోనూ ప్రత్యేకమైన యూజర్ నేమ్ క్రియేట్ చేసుకునే అవకాశం కల్పించనున్నది. ఫోన్ నెంబర్ లేకుండానే కేవలం యూజర్ నేమ్ తో క్రియేట్ చేసుకోవచ్చు.

ఇప్పటివరకు వాట్సాప్ లో కేవలం ఫోన్ నెంబర్ నుంచే మనం చాట్ చేస్తున్నాం. కానీ ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే ఫోన్ నెంబర్ తో కాకుండా యూజర్ నేమ్ తో చాట్ చేయవచ్చును. ఫోన్ నెంబర్ తెలియాల్సిన అవసరం లేని వారితో చాటింగ్ కోసం యూజర్ నేమ్ ను వాడుకోవచ్చును.

 

ALSO READ ; Komatireddy, Hareeshrao : కోమటిరెడ్డిని హరీష్ రావు అంత మాట అనేశాడా.. అయితే ఆయన రియాక్షన్ ఏంటి..!

 

యూజర్ నేమ్ క్రియేట్ చేసిన తర్వాత అది వాట్సాప్ డేటా బేస్ లో సేవ్ అవుతుంది. యూజర్ నేమ్ తెలిసినవారు వాట్సాప్ లో దాన్ని టైప్ చేసి చాటింగ్ కోసం కనెక్ట్ కావచ్చును. వాట్సాప్ లో ఒకరికొకరు కనెక్ట్ కావడానికి మరో ప్రత్యామ్నాయ కూడా రెడీ అవుతుంది.

ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలోనే ఉంది. తొలివిడతగా ఈ ఫీచర్లను వాట్సప్ వెబ్ లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. ఈ ఫీచర్ కు అనుగుణంగా వాట్స్అప్ ఇంటర్ ఫేస్ లో మార్పులు చేసి దాన్ని మరింతగా మెరుగు చేసే విధంగా కసరత్తు జరుగుతుంది. డిస్కార్డ్ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ లో ఈ ఫీచర్ ఇప్పటికే కొనసాగుతుంది. కొత్తగా వాట్సప్ యాప్ లో కూడా తీసుకురానున్నారు.

ఇవి కూడా చదవండి : 

Nagarjunasagar : నాగార్జునసాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద.. 511 అడుగులకు చేరిన నీటిమట్టం.. Latest Update

BIG BREAKING : శ్రీశైలంకు గంట గంటకు పెరుగుతున్న వరద.. ఈరోజే ఎత్తనున్న 4 గేట్లు..!

Srisailam : శ్రీశైలంకు 4.36 లక్షల క్యూసెక్కుల వరద, నిండుకుండలా జలాశయం.. రేపు గేట్లు ఎత్తనున్న మంత్రి రామానాయుడు..!

30న రెండో విడత రుణమాఫీ..!

క్యూసెక్కులు అంటే ఏమిటి.. నీటి ప్రవాహాన్ని అలా ఎందుకు కొలుస్తారు..!

రైతులకు రూ. 5 లక్షల పథకం.. అర్హతలు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి, ఆగస్టు 5 చివరి తేదీ..!

మరిన్ని వార్తలు