Srisailam : శ్రీశైలంకు 4.36 లక్షల క్యూసెక్కుల వరద, నిండుకుండలా జలాశయం.. రేపు గేట్లు ఎత్తనున్న మంత్రి రామానాయుడు..!
Srisailam : శ్రీశైలంకు 4.36 లక్షల క్యూసెక్కుల వరద, నిండుకుండలా జలాశయం.. రేపు గేట్లు ఎత్తనున్న మంత్రి రామానాయుడు..!
మన సాక్షి, అమరావతి:
కర్ణాటక, మహారాష్ట్ర తో పాటు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది, తుంగభద్ర నది ఉప్పొంగుతుంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 1.5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
కాగా శ్రీశైలం జలాశయానికి 4.36 లక్షల వరద నీరు వచ్చి చేరుతుంది. దాంతో శ్రీశైల జలాశయం మట్టం భారీగా పెరిగింది. జలాశయం నిండుకుండలా మారింది. శ్రీశైలం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 885 అడుగులకు గాను ప్రస్తుతం 879 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను 171 ఎంసీల నీరు నిల్వ ఉంది. దాంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
రేపు గేట్లు ఎత్తనున్న మంత్రి రామానాయుడు :
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో జలాశయం నిండుకుండలా మారింది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని విడుదల చేయడంతో పాటు ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పాదన చేస్తున్నారు.
శ్రీశైలం నుంచి దిగువకు 62,450 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా పూర్తిస్థాయిలో జలాశయం ఉండడంతో గేట్లు ఎత్తనున్నారు. ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి రామానాయుడు ఈనెల 30వ తేదీన ఉదయం శ్రీశైలం ఆనకట్టపై జల హారతి కార్యక్రమం నిర్వహించి గేట్లు ఎత్తనున్నారు.
ఇవి కూడా చదవండి :
Srisailam : శ్రీశైలంకు కొనసాగుతున్న భారీ వరద.. గేట్లు ఎత్తేందుకు తేదీ ఫిక్స్..!
Srisailam : శ్రీశైలంకు 4.14 లక్షల క్యూసెక్కుల వరద.. నాగార్జునసాగర్ కు ఇన్ ఫ్లో.. Latest Update
రైతులకు రూ. 5 లక్షల పథకం.. అర్హతలు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి, ఆగస్టు 5 చివరి తేదీ..!









