Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఆంధ్రప్రదేశ్జాతీయం

Srisailam : శ్రీశైలంకు కొనసాగుతున్న భారీ వరద.. గేట్లు ఎత్తేందుకు తేదీ ఫిక్స్..!

Srisailam : శ్రీశైలంకు కొనసాగుతున్న భారీ వరద.. గేట్లు ఎత్తేందుకు తేదీ ఫిక్స్..!

మన సాక్షి, అమరావతి :

కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలతో పాటు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది ఉప్పొంగుతోంది. కృష్ణా నదిపై నిర్మించిన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో ఉండడంతో గేట్ల ఎత్తి దిగకు నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. దాంతో తుంగభద్ర గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

కాగా అటు జూరాల ఇటు తుంగభద్ర గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో శ్రీశైలంకు భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. రెండు ప్రాజెక్టుల నుంచి నీరు రావడంతో శ్రీశైలంకు 4,34, 483 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 885 అడుగులకు గాను ప్రస్తుతం 873 అడుగులకు చేరింది.

శ్రీశైలం గేట్లు ఎత్తేందుకు సన్నాహాలు :

శ్రీశైలంకు భారీ వరద చేరుతున్నందున గేట్లు ఎత్తేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేసింది. అధికారులు గేట్లు అయితే ఎందుకు ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి ఎన్ రామానాయుడు, జిల్లా మంత్రులు, ఇన్చార్జి మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొని ఈనెల 30వ తేదీన శ్రీశైలం ఆనకట్ట వద్ద జల హారతి కార్యక్రమం నిర్వహించి గేట్లు ఎత్తనున్నారు.

ఇవి కూడా చదవండి : 

Srisailam : శ్రీశైలంకు 4.14 లక్షల క్యూసెక్కుల వరద.. నాగార్జునసాగర్ కు ఇన్ ఫ్లో.. Latest Update

క్యూసెక్కులు అంటే ఏమిటి.. నీటి ప్రవాహాన్ని అలా ఎందుకు కొలుస్తారు..!

రైతులకు రూ. 5 లక్షల పథకం.. అర్హతలు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి, ఆగస్టు 5 చివరి తేదీ..!

మరిన్ని వార్తలు