Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

BIG BREAKING : చెన్నై వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. నల్గొండలో బోల్తా..!

BIG BREAKING : చెన్నై వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. నల్గొండలో బోల్తా..!

మన సాక్షి, నల్గొండ :

హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నల్గొండ జిల్లా కేంద్రంలోని చంద్రగిరి విల్లాస్ వద్ద బోల్తా పడింది. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు మర్రిగూడ బైపాస్ వద్ద భారీకేడ్లను తప్పించబోయి బోల్తా పడినట్లు తెలుస్తోంది.

ఈ బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఈ సంఘటనలో సుమారు 20 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉంది. గాయాలైన వారందరిని నలగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గాఢ నిద్రలో ఉన్నప్పుడు బస్సు ఒకసారిగా పల్టీ కొట్టడంతో అహకారాలు నెలకొన్నాయి. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వాహన రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు