Breaking Newsక్రైంజిల్లా వార్తలుహైదరాబాద్
హైదరాబాద్ లో రాంబాయి సినిమా తరహా ఘటన..!
హైదరాబాదులోని పోచారంలో రాంబాయి సినిమా తరహా దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పెళ్లి రద్దయిందని అమ్మాయికి ఓ యువకుడు ఎయిడ్స్ ఇంజక్షన్ వేశాడు.

హైదరాబాద్ లో రాంబాయి సినిమా తరహా ఘటన..!
మన సాక్షి, హైదరాబాద్ :
హైదరాబాదులోని పోచారంలో రాంబాయి సినిమా తరహా దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పెళ్లి రద్దయిందని అమ్మాయికి ఓ యువకుడు ఎయిడ్స్ ఇంజక్షన్ వేశాడు. యువకుడు మనోహర్ తో యువతికి వివాహం నిశ్చయమైంది. ఎయిడ్స్ ఉందని తేలడంతో పెళ్లికి నిరాకరించారు. ఎయిడ్స్ బాధితుడైన మనోహర్ అనే యువకుడు తనకు నిశ్చయమైన పెళ్లి రద్దయిందని కక్ష పెంచుకున్నాడు. ఈనెల 11వ తేదీన ఆ యువకుడు యువతీ ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. దాంతో ఆమె నిరాకరించింది. తన రక్తంతో కూడిన ఇంజక్షన్ ను ఆమెకు బలవంతంగా ఎక్కించాడు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు మనోహర్ ను అదుపులోకి తీసుకున్నారు.









