Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేటలో నిషేధిత హుక్కా అమ్మకాల జోరు.. పోలీసుల ఉక్కుపాదం..!

ప్రజల ఆరోగ్యాలను హరించే వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు అని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ హెచ్చరించారు.

Suryapet : సూర్యాపేటలో నిషేధిత హుక్కా అమ్మకాల జోరు.. పోలీసుల ఉక్కుపాదం..!

  • రూ.15 వేల విలువైన నిషేధిత హుక్కా ఫ్లేవర్ ప్యాకెట్లు, హుక్కా వెపర్ స్వాధీనం.

  • వస్త్ర దుకాణాల్లో అమ్మకాలు చేస్తున్న వ్యాపారులపై మూడు కేసు నమోదు.

సూర్యాపేట, మనసాక్షి:

ప్రజల ఆరోగ్యాలను హరించే వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు అని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ హెచ్చరించారు. గురువారం నమ్మదగిన సమాచారం మేరకు సూర్యాపేట పట్టణ పోలీసులు సూర్యాపేట పట్టణం మెయిన్ రోడ్ నందు గల ఆర్.వి ఫ్యాషన్స్, ఎక్స్ట్రీమ్ ఫ్యాషన్స్ వస్త్ర దుకాణాల నందు హుక్కా అమ్మకాలు నిర్వహిస్తున్నారు అనే సమాచారంపై పట్టణ పోలీసులు తనిఖీలు నిర్వహించగా 15వేల రూపాయల విలువైన నిషేధిత హుక్కా ప్యాకెట్లు, హుక్కా వెపర్ లు దొరికనైనది అని ఎస్పి తెలిపారు.

దీనికి సంభందించి ముగ్గిరిపై కేసు నమోదు చేయడం జరిగినది అన్నారు. నిషేధిత హుక్కా వెపర్ సేవించడం వల్ల క్యాన్సర్ సంభంద వ్యాధులు వస్తాయని , ప్రజల ఆరోగ్యాలను హరించే ఇలాంటి వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిని సేవించడం వల్ల అనారోగాల పాలు అవుతారని అన్నారు. యువత ఇలాంటి చెడు అలవాట్లకు లోనుకావొద్దు అని తెలిపారు. ఇలాంటి అమ్మకాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని కోరారు.

By : Rangu MuthyamRaju, Sr.Journalist

MOST READ : 

మరిన్ని వార్తలు