Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయం

BIG BREAKING : కడియం, దానం పార్టీ ఫిరాయింపు పై స్పీకర్ సంచలన తీర్పు..!

తెలంగాణ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపుల అనర్హత పిటిషన్ పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన తీర్పు విలువరించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి లపై దాఖలైన అనర్హత పిటిషన్ ను ఆయన కొట్టివేశారు.

BIG BREAKING : కడియం, దానం పార్టీ ఫిరాయింపు పై స్పీకర్ సంచలన తీర్పు..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

తెలంగాణ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపుల అనర్హత పిటిషన్ పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన తీర్పు విలువరించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి లపై దాఖలైన అనర్హత పిటిషన్ ను ఆయన కొట్టివేశారు. దాంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్ లభించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈనెల 12వ తేదీలోగా అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ చేసి తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది.

కాగా గతంలో ఎనిమిది మందికి క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. దాంతో పది మంది ఎమ్మెల్యేలకు కూడా ఊరట లభించింది. బీఆర్ఎస్ టికెట్ పై గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ 10 మంది ఎమ్మెల్యేలపై బిఆర్ఎస్ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.

స్పీకర్ ఆలస్యం చేస్తున్నారని హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. దాంతో సుప్రీంకోర్టు స్పీకర్ కు విధించిన విషయం తెలిసిందే. కాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ అనర్హత పిటిషన్ కొట్టివేశారు. దాంతో ఆ పదిమంది ఎమ్మెల్యేలు కూడా బిఆర్ఎస్ లోని ఉన్నట్లు తీర్పు వెలువరించారు.

MOST READ 

మరిన్ని వార్తలు