Gold Price : పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్..!
Gold Price : పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
ఇటీవల కాలంలో బంగారం ధరలు హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తులం బంగారం 80 వేల రూపాయల మార్కు వరకు ఇటీవల కాలంలో రెండు పర్యాయాలు వెళ్ళింది. ఆ తర్వాత మళ్లీ తగ్గింది. దాంతో మహిళలు కొనుగోలు పట్ల ఆసక్తి కనబరిచారు. కాగా శుక్రవారం గోల్డ్ రేట్ మళ్లీ పెరిగింది.
100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర శుక్రవారం 2700 రూపాయలు పెరిగింది. అదే విధంగా 22 క్యారెట్స్ ధర 2500 రూపాయలు పెరిగింది. గురువారం 100 గ్రాముల ధర 7,77,300 రూపాయలు ఉండగా 2,700 పెరిగి రూ.7,80, 000 గా ఉంది. 22 క్యారెట్స్ కు గురువారం 7,12,500 రూపాయలు ఉండగా శుక్రవారం 2500 రూపాయలు పెరిగి 7,15,000 గా ఉంది.
హైదరాబాదులో (10 గ్రాముల) తులం బంగారం 22 క్యారెట్స్ శుక్రవారం 71, 500 రూపాయలు ఉంది. 24 క్యారెట్స్ (10 గ్రాముల) తులం బంగారం 78,000 రూపాయలు ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాని పట్టణాల్లో అవే కొనసాగుతున్నాయి.
MOST READ :









