తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లావిద్య

Alumni : 34 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక..!

Alumni : 34 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక..!

నారాయణపేటటౌన్, మనసాక్షి :

నేటి సమాజంలో విద్యాలయాలు సంసృతి, సాంప్రదాయాలకు నిలయాలు గా ఉన్నాయంటే 50 ఏళ్ల క్రితం ఆర్యసమాజం లో నైతిక విలువల పై ప్రత్యేక భొధన ఉన్నందున నేటి తరాలకు మీరే ఆదర్శంగా ఉన్నారని విఠల్ రావు ఆర్యా అన్నారు.

ఆదివారం నారాయణపేట లక్ష్మీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన దయానంద విద్యామందిర్ 1990-91 పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నేడు సెల్ ఫోన్ లు వచ్ఛిన తరువాత విద్యార్థులు చదువుల పై శ్రద్ధ చూపటం లేదన్నారు. కావున విద్యార్థుల తల్లిదండ్రులు వారి నడవడిక పై ఓ కన్ను వేసి ఉంచాలన్నారు.

ఆలాగే 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న మీరు నేటికి జీవితం లో అందరు ఉన్నతమైన హోదాలో ఉన్నారు. పెద్దల పట్ల గౌరవం కలిగి ఉన్నారు. ఈ మీ నైతిక విలువ మీ పిల్లల కు వారసత్వంగా ఇవ్వాలన్నారు. 34 సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు పాఠశాలలో చదువుకునే రోజులలో ని పాత జ్ఞాపకాలను నెమర వేసుకున్నారు.

పాఠాలు నేర్పిన ఉపాధ్యాయులకు షాలువలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువు ఉపాధ్యాయులు మాట్లాడుతూ కురు శిష్యుల బంధం కుటుంబం కన్నా మహోన్నతమైనదని పేర్కొన్నారు. అంతకుముందు స్వర్గస్తులైన ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులకు ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లికార్జున్, శ్రీనివాస్, ప్రభాకర్, నాగమ్మ, నారాయణ, అమర్నాథ్, బ్రహ్మయ్య, పద్మమ్మ, రాంచరణ్, నారాయణరెడ్డి, విద్యార్థులు సతీష్ , కృష్ణా పవాది, రమాకాంత్, వెంకటేష్ సంగ రాఘవేంద్ర, రఘురాం గౌడ్, నరేందర్, జొన్నల సుభాష్, సంధ్యారాణి, శ్రీలత, సంగీతా, రాజేశ్వరి పాల్గొన్నారు.

MOST READ : 

  1. Dost : దోస్త్ ద్వారా రేపు డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు..!

  2. Land : భూములు కొంటున్నారా.. తస్మాత్‌ జాగ్రత్త..!

  3. Crypto currency : నకిలీ క్రిప్టో కరెన్సీ.. మాజీ కార్పొరేటర్ అరెస్ట్..!

  4. TG News : పట్టపగలు దారి దోపిడీ.. కళ్ళల్లో కారం కొట్టి రూ.40 లక్షలు చోరీ..! 

మరిన్ని వార్తలు