Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
Suryapet : హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. రెండు ట్రావెల్స్ బస్సులు ఢీకొని ఇద్దరు మృతి..!
Suryapet : హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. రెండు ట్రావెల్స్ బస్సులు ఢీకొని ఇద్దరు మృతి..!
మన సాక్షి, సూర్యాపేట :
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు శనివారం ఉదయం ఢీకొన్నాయి. జాతీయ రహదారిపై ఎస్వి కళాశాల సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది.
ఈ ఘటనలో బస్సు క్లీనర్ అద్దంలో నుంచి ఎగిరి పడగా అతనిపై నుంచి బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ప్రయాణికుడు గుండెపోటుతో మృతి చెందాడు. వారితోపాటు మరో ఐదుగురికి గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన వారిని సూర్యాపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారు గుంటూరు వాసులు సాయి, రసూల్ గా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.
| MOST READ :
-
Hyderabad : హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించారు.. ఎల్బీనగర్ టు ఖైరతాబాద్.. (వీడియో)
-
Nalgonda : చెర్వుగట్టు రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వేళాయె.. ఎమ్మెల్యే వీరేశం, జిల్లా కలెక్టర్ ప్రత్యేక పూజలు..!
-
Free Current : దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. ఈ పథకానికి అప్లై చేసుకోండిలా..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు అనర్హుల గుర్తింపు.. ప్రారంభమైన క్షేత్రస్థాయి సర్వే..!









