Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయంసంక్షేమం

Free Current : దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. ఈ పథకానికి అప్లై చేసుకోండిలా..!

Free Current : దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. ఈ పథకానికి అప్లై చేసుకోండిలా..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

దేశవ్యాప్తంగా ఉచిత గృహ విద్యుత్తును అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన పథకాన్ని తీసుకొచ్చింది. ఒక్కరికి 300 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందజేయనున్నది. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ పొందాలనే సంకల్పంతో రూప్ టాప్ సోలార్ ప్యానల్ స్కీంను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలో కోటి ఇండ్లకు ప్రతినెల 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ పథకం పేరు ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం.

ఈ పథకం ద్వారా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు వారికి సంపాదన మార్గం కూడా చూపించడం ప్రభుత్వం లక్ష్యము. గత ఏడాది ఫిబ్రవరి మాసంలో ప్రారంభించిన ఈ పథకం కోసం బడ్జెట్లో 75,021 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది.

ఈ పథకంలో భాగంగా వారి ఇంటి పై సోలార్ ప్యానల్ బిగించి వాటి ద్వారా విద్యుత్ సరఫరా చేస్తారు. ప్రతి కుటుంబం రూప్ టాప్ సోలార్ సిస్టంను స్వీకరించేలా ప్రోత్సహించడానికి గాను కేంద్రం ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుంది. ఇంటికి పైకప్పు పై 3 KW సోలార్ ప్యానల్స్ బిగించడానికి సుమారుగా 1,80,000 ఖర్చవుతుంది. అందులో ప్రభుత్వం సబ్సిడీ 78 వేల రూపాయలు ఇస్తుంది.

మిగతా మొత్తం EMI పద్ధతిలో చెల్లించవచ్చును. ఈ పథకంలో భాగంగా వీలైనంత ఎక్కువమంది తమ ఇళ్లపై సోలార్ ప్యానల్ పొందే అవకాశం ఉంది. 1KW కు 30 వేల రూపాయలు, 2KW కు 60 వేల రూపాయలు, 3KW కు అంతకంటే ఎక్కువ సిస్టంకు 78 వేల రూపాయల సబ్సిడీని అందించనున్నారు.

కాగా ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకానికి దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.. జాతీయ రూప్ టాప్ సోలార్ పోర్టల్ విజిట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చును. పోర్టల్ లో అందుబాటులో ఉన్న క్యూరేటెడ్ జాబితా లో విక్రయతను ఎంచుకోవాలి. గతంలో కుటుంబం సోలార్ ప్యానల్ సబ్సిడీ పొంది ఉన్నట్లయితే ఇది వర్తించదు.

| MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా కు అనర్హుల గుర్తింపు.. ప్రారంభమైన క్షేత్రస్థాయి సర్వే..!

  2. Indiramma Bharosa : భూమిలేని వారికి ఏటా రూ.12 వేలు.. మీరూ అర్హులేనా.. నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలన..!

  3. Rythu Bharosa : రైతు భరోసా కు వారిని అనర్హులుగా గుర్తించాలి.. జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం..!

  4. Viral Video : సైలెంట్ గా నిలబడిన కోడి.. పందెంలో గెలిచింది.. (వీడియో వైరల్)

  5. Railway Jobs : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!

మరిన్ని వార్తలు