Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

Railway Jobs : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!

Railway Jobs : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

నిరుద్యోగులకు శుభవార్త అందింది. భారతీయ రైల్వే అనుబంధ సంస్థ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డి ఎఫ్ సి సి ఐ ఎల్) లో ఖాళీ ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ విభాగాలలో భర్తీ చేయనున్నారు.

ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హత ఆసక్తి ఉన్నవారు 2025 జనవరి 18వ తేదీ నుండి ఆన్‌లైన్ లో ధరఖాస్తు చేసుకో వచ్చును.

ఖాళీల వివరాలు :

జూనియర్ మేనేజర్ ఫైనాన్స్ – 03

ఎగ్జిక్యూటివ్ సివిల్ – 36

ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ – 64

ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికాం – 75

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 464

ధరఖాస్తు ఎలా..?

ఖాళీ ఉద్యోగాలకు ధరఖాస్తు రుసుము 1000 రూపాయలు ఉంటుంది. మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలకు 500 రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఫీజులో రాయితీ ఉంటుంది.

2025 జనవరి 18వ తేదీ నుండి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. 2025 ఫిబ్రవరి 16వ తేదీ వరకు చివరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలి.

పూర్తి నోటిఫికేషన్ ఆన్‌లైన్ లో చూడండి. అందుకోసం DFCCIL అధికారిక వెబ్ సైట్ సందర్శించాలి.

MOST READ : 

మరిన్ని వార్తలు